Naga Shourya : నాగశౌర్య గురించి ఈ విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఈయనలో ఇంత టాలెంట్ ఉందా?

టాలీవుడ్ హీరో నాగశౌర్య( Naga Shourya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్( Tollywood ) లో నాగశౌర్య చలో, లక్ష్య, వరుడు కావలెను, రంగబలి, అశ్వద్ధామ, నర్తనశాల కల్యాణ వైభోగమే ఒక మనసు లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Naga Shaurya Plays Basket Ball In National Level At College Times-TeluguStop.com

ఈ మధ్యకాలంలో వరసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు నాగశౌర్య.సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు.

సెకండ్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Telugu Basket, Times, Naga Shaurya, Rangabali, Tollywood-Movie

కెరీర్ ఆరంభంలో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద ( Jyo Achutananda )లాంటి మంచి సినిమాలలో నటించి మెప్పించాడు.గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు శౌర్య.తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు నాగశౌర్య.

నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగబలి( Rangabali ).ఈ సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగశౌర్య ఒక ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు.ఈ సందర్బంగా నాగశౌర్య మాట్లాడుతూ.నేను కాలేజీ టైంలో బాస్కెట్ బాల్ బాగా ఆడాను.నేషనల్స్ కూడా ఆడాను.

Telugu Basket, Times, Naga Shaurya, Rangabali, Tollywood-Movie

పశ్చిమగోదావరి జిల్లా నుంచి నేషనల్ లెవల్ లో ఆడటానికి ఇద్దరు సెలెక్ట్ అయితే అందులో నేను కూడా ఒక్కడిని.బాస్కెట్ బాల్ ఆ రేంజ్ లో నేషనల్ లెవల్ ( National level )లో చాలా సార్లు ఆడాను.ఇంటర్నేషనల్స్ కి కూడా వెళదామని కోచింగ్ కూడా తీసుకున్నాను.కానీ ఎందుకో నా వల్ల కాదనిపించి వదిలేశాను అని చెప్పుకొచ్చాడు నాగశౌర్య.కాగా శౌర్య చేసిన వాఖ్యలు సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు స్పందిస్తూ నాగశౌర్యలో ఇంత టాలెంట్ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube