ప్రపంచంలోని కోట్లాది మంది జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులలాగే చూస్తారు.ఈ అనుబంధం వారి జీవితాలలో ఆనందాన్ని నింపుతుంది.
అయితే, కొన్ని సందర్భాలలో ఈ అనుబంధమే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది.ఎందుకంటే జంతు ప్రేమికులు(Animal Lovers) వాటి పట్ల ప్రేమ కురిపించినా అవి మాత్రం దాడులు చేస్తూనే ఉంటాయి.
వాటి స్వభావం మనుషుల్లా ఉండదు.మంచిగా ఉంటూనే అవి సడన్‌గా అటాక్ చేస్తాయి.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తుంది.ఇందులో ఒక వృద్ధ మహిళ తన దగ్గరకు వచ్చిన కొండముచ్చుపై ప్రేమ చూపించింది.
కానీ అదే ఆమె చేసిన పెద్ద తప్పు అయింది.
వైరల్ వీడియోలో, ఆ వృద్ధురాలు తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉంది.
అప్పుడు ఒక కొండముచ్చు ఆమె దగ్గరకు వచ్చి, ప్రేమగా ఆమెను కౌగిలించుకుని, తలను తడుముకుని, ముద్దాడింది.దాదాపు అరగంట సేపు ఆ కోతి (monkey)ఆ మహిళ దగ్గరే ఉండిపోయింది.
ఆ సమయంలో ఆ మహిళకు ఎలాంటి భయమూ లేదు.ఆమె కూడా కోతిని ప్రేమగా కౌగిలించుకుని తడుముతూ ఉంది.
ఇద్దరి మధ్యా ఎలాంటి దూకుడు చర్యలు కనిపించలేదు.
కానీ, అకస్మాత్తుగా పరిస్థితి భయంకరంగా మారింది.ఏ హెచ్చరిక లేకుండా ఆ కోతి ఆ మహిళ ముఖంపై దాడి చేసింది.ఆ దాడి చాలా దారుణంగా ఉంది.
ఆ మహిళ (woman)ముఖం బాగా ఇంజురీ అయింది.ఆమెను కొరికిన తర్వాత కోతి పారిపోయింది.
తీవ్ర నొప్పితో ఆ మహిళ రోదించడం వీడియోలో వినవచ్చు.ఆ దాడి ఎంతో భయానకంగా ఉంది, అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కి గురి చేసింది.
జంతువులపై ప్రేమ, అనురాగం చూపించడం మన సహజ స్వభావం.కానీ, జంతువుల స్వభావం అనూహ్యంగా ఉంటుందనే విషయాన్ని మనం మరచిపోకూడదు.ఎంత మృదువుగా, స్నేహపూర్వకంగా(friendly) ఉన్నప్పటికీ, జంతువులు అకస్మాత్తుగా ప్రవర్తించవచ్చు.ఈ వీడియో మనకు ఒక గుణపాఠం చెబుతుంది.అదేంటంటే, జంతువులతో మనం మంచి బంధాన్ని ఏర్పరచుకోవచ్చు కానీ, వాటి స్వభావాన్ని గౌరవించాలి.వాటి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎక్కువగా దగ్గరగా ఉండటం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.