బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలకు దిగుతోంది.ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది.
ఇక కేటీఆర్ సైతం అరెస్టు విషయంలో ఆసక్తిగానే ఉన్నారు.తనను దమ్ముంటే అరెస్టు చేయాలని, తాను హైదరాబాద్(Hyderabad) లోనే ఉన్నానని, అరెస్ట్ చేసుకోవాలి అంటూ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు.తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే తన ఇమేజ్ మరింతగా పెరుగుతుందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చేందుకు,
తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని కేటీఆర్ అంచనా వేస్తున్నారు.అందుకే అరెస్టు విషయంలో ఈ విధంగా సవాళ్లు విసురుతున్నారు.ఇప్పటికే ఏసీబీ(ACB) అధికారులు ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన కుంభకోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.ఈ కేసులోనే కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.అందుకే కేటీఆర్ కూడా తనను అరెస్టు చేసుకోవాలంటూ సవాళ్లు విస్తరిస్తున్నారు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, వెంటనే అరెస్టు చేసుకోవాలంటూ సవాల్ చేస్తున్నారు.జైల్లో ఎన్ని రోజులు ఉన్నా, తాను పూర్తి ఫిట్ నెస్ తో బయటకి వస్తానని , ఆ తరువాత పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయంగా మైలేజ్ పొందేందుకు పాదయాత్ర చేపట్టి, తెలంగాణ(Telangana) ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తన అరెస్టు వ్యవహారం కలిసి వస్తుందని భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది.
అందుకే అరెస్టు విషయంలో ఇంతగా తహతహలాడుతున్నట్టుగా కనిపిస్తోంది.జైలుకు వెళితే ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరుగుతుందని కేటీఆర్(KTR) అంచనా వేస్తున్నారు.ఏపీలో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత జగన్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత వైసిపి(YCP) ప్రభుత్వం లో చంద్రబాబు(Chandrababu) జైలుకు వెళ్లడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న కేటీఆర్ తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ఆసక్తితో ఉన్నారు.2027 లోనే జమిలి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాను అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్లి బయటకు వచ్చి పాదయాత్ర నిర్వహిస్తే కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు.