సాధారణంగా కొందరి మెడ ముఖం తో పోలిస్తే చాలా నల్లగా ఉంటుంది.ముఖం ఎంత అందంగా ఉన్నా సరే డార్క్ నెక్ వల్ల కాంతిహీనంగా కనిపిస్తారు.
ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్, శరీరంలో వేడి ఎక్కువ కావడం, పలు దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.మీరు కూడా డార్క్ నెక్ సమస్యతో బాధపడుతున్నారా.? వారంలో మెడ నలుపు మాయం అవ్వాలా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ( Coffee powder )వేసుకోవాలి.ఈ రెమెడీ లో మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడరే.
డార్క్ నెక్ ను వైట్ గా మార్చడానికి కాఫీ పౌడర్ అద్భుతంగా తోడ్పడుతుంది.అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్లు వచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె, ( Honey )మూడు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్( Tomato juice ) వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం తడి వేళ్ళతో మెడను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.అలా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.చాలా మంది మాయిశ్చరైజర్ ను ముఖానికి రాసుకుంటారు.కానీ మెడను పట్టించుకోరు.
అయితే నిత్యం మెడకు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.

ఇక పైన చెప్పుకున్న రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే వారం రోజుల్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది.మీ మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.మళ్లీ మీ నెక్ వైట్ అండ్ బ్రైట్ గా మెరుస్తుంది.
కాబట్టి అందమైన మెరిసే తెల్లటి మెడను కోరుకునేవారు, డార్క్ నెక్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.