స్వీట్ కార్న్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా?

స్వీట్ కార్న్ ని ఉడికించి ఉప్పు,కారం, మసాలా జల్లితే ఎవరికీ మాత్రం నోరు ఉరదు.ఇప్పుడు వానాకాలం వచ్చేసింది.

 Sweet Corn Nutrition Facts And Health Benefits-TeluguStop.com

ఈ వానాకాలంలో స్వీట్ కార్న్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఈ గింజలలో పీచు,విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి.దీనిలో ఉండే ఫెరులిక్ ఆమ్లం వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా అడ్డుకుంటుంది.

స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది కాబట్టి తీపి శాతం ఎక్కువగా ఉందని కంగారు పడవలసిన అవసరం లేదు.సరైన మోతాదులో ప్రతి రోజు తీసుకోవచ్చు.

దీనిలో ఉండే విటమిన్ B కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

స్వీట్ కార్న్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన జీవక్రియను మెరుగుపరుస్తుంది.

దీనిలో ఉండే థయామిన్ మెదడు ఆరోగ్యానికి మరియు ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

స్వీట్ కార్న్ లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ జియా గ్జాదిన్ వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

ఇన్ని ప్రయోజనాలను కలిగి ఉన్న స్వీట్ కార్న్ ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటారు కదా….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube