ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) ముగిశాయి.ఎగ్జిట్ పోల్స్ , సర్వే అంచనాలను తలక్రిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఘన విజయం సాధించారు.
దీంతో డెమొక్రాట్ శ్రేణులు నిరుత్సాహంలో మునిగిపోయాయి.అయితే కమలా హారిస్( Kamala Harris ) ఓటమికి అధ్యక్షుడు జో బైడెనేనంటూ డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.
బైడెన్( Biden ) అధ్యక్ష ఎన్నికల్లో కొనసాగి ఉంటే.ట్రంప్ అవలీలగా 400 ఎలక్టోరల్ ఓట్లు సాధించేవారని వైట్‌హౌస్ ఇంటర్నల్‌గా చేసిన సర్వేల్లో ముందే తేలిందట.
ఈ విషయాన్ని గతంలో బరాక్ ఒబామాకు రైటర్‌గా పనిచేసిన జాన్ ఫ్రావూ( Jon Favreau ) తెలిపారు.
ప్రస్తుతం సేవ్ అమెరికా పేరిట పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న బైడెన్.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జో బైడెన్ రేసులో నిలబడకుండా ఉండాల్సిందని జాన్ తెలిపారు.
డెమొక్రాట్లకు నష్టం జరిగే వరకు ట్రంప్ 400 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తారనే విషయాన్ని బైడెన్ అంగీకరించలేదని ఫైరయ్యారు.పైగా తన పాలన అమెరికా చరిత్రలోనే సువర్ణాధ్యాయం అన్నట్లుగా వ్యవహరించారని జాన్ మండిపడ్డారు.
ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న తర్వాత కమలా హారిస్‌కు అధ్యక్షుడి బృందం వెన్నుపోటు పొడిచిందని, ఆమె గెలవలేదని మీడియాకు ఫిలర్లు వదిలిందని జాన్ ఫ్రావూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే అంతకుముందే బైడెన్ తీరును తప్పుబట్టారు డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి బైడెన్ ముందే తప్పుకుని ఉంటే రేసులో ఎక్కువ మంది అభ్యర్ధులు ఉండేవారని ఆమె అభిప్రాయపడ్డారు.బైడెన్ ఆలస్యం చేయడంతో ప్రైమరీలు నిర్వహించడానికి సమయం లేకుండా పోయిందని పెలోసీ అన్నారు.
కానీ కమలా హారిస్ గొప్పగా పోరాడి డెమొక్రాట్లలో ఆశలను పెంచారని ఆమె ప్రశంసించారు.
తొలుత అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన జో బైడెన్.
అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా పలు విమర్శలు ఎదుర్కొన్నారు.అయితే తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ దూకుడు ముందు బైడెన్ నిలబడలేకపోయారు.
సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో ఆయన అభ్యక్ష బరిలో నుంచి తప్పుకుని కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు.