ఐదు గురువారాలు ఈ అద్భుతమైన వ్రతంతో మీకు అన్ని శుభాలే..!

మహావిష్ణువు( Vishnu )కు అత్యంత ప్రియమైన మార్గశిరం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదే.అయితే ఈ మాసంలో వచ్చే తొలి లక్ష్మీవారం అంటే గురువారం నుండి ఐదు గురువారాలపాటు భక్తితో తనను కొలిచేవారిని ఆ మహాలక్ష్మి అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 All The Best To You With This Wonderful Fast For Five Thursdays ,lord Vishnu-TeluguStop.com

కాబట్టి ఈ మాసంలో మహిళలు లక్ష్మీవార వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు.దీనినే కొందరు లక్ష్మీపూజ, లక్ష్మీ వ్రతం అని కూడా అంటారు.

మార్గశిర లక్ష్మీ పూజ( Marga sira Lakshmi Puja) 5 గురువారాలు చేయాల్సి ఉంటుంది.ఒకవేళ మార్గశిర మాసంలో నాలుగు గురువాలే వస్తే, ఐదో వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా చేసుకోవచ్చు.

అయితే ఈ వ్రతం చేసేవారు గురువారం వేకువనే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, స్నానం చేసి వాకిట ముగ్గులు వేయాలి.

Telugu Devotional, Lakshmi Devi, Lord Vishnu, Margasira, Sri Mahalakshmi, Thursd

అలాగే పూజ మందిరంలో బియ్యం పిండితో ముగ్గు వేసి, లక్ష్మీదేవి( Lakshmi Devi ) ప్రతిమను ప్రతిష్టించుకుని పూలతో అలంకరించుకోవాలి.ఇక వ్రతం నిర్విఘ్నంగా జరగాలంటూ గణపతిని స్మరించుకోవాలి.అంతేకాకుండా మహాలక్ష్మికి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని ఇచ్చి పూజించాలి.

అనంతరం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.నైవేద్యం సమర్పించాలి.లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని తలపై అక్షంతలు వేసుకుని, చివరగా క్షమా ప్రార్ధన చేయాలి.అలాగే ఈ వ్రతం చేసేవారు తొలి గురువారం అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

Telugu Devotional, Lakshmi Devi, Lord Vishnu, Margasira, Sri Mahalakshmi, Thursd

ఇక రెండవ గురువారం అట్ల, కొబ్బరి పానీయాన్ని సమర్పించాలి.ఇక మూడో వారం అప్పాడాలు, పరమాన్నాన్ని సమర్పించాలి.ఇక నాలుగో గురువారం చిత్రాన్నం, గారెలు సమర్పించాలి.ఇక ఆఖరి గురువారం పూజలు, అమ్మవారికి పూర్ణం బూరెలను సమర్పించాల్సి ఉంటుంది.ఇక ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వడ్డించాలి.అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి.

దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టే.అయితే ఈ వ్రతం చేసే ప్రతి ఒక్కరికి కూడా అన్ని శుభాలే జరుగుతాయి.

అలాగే కోరుకున్న అన్ని కోరికలని లక్ష్మీదేవి కచ్చితంగా నెరవేరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube