నువ్వు తినడానికి బతుకుతున్నావా.? బతకడానికి తింటున్నావా.? అంటే సమాధానం మంచిగా బతికి తినడానికి అని చెప్పాలి.మనం ప్రతి రోజు తినే ఆహారం ఎంత వరకు శుభ్రంగా ఉన్నదో, ఎంత వరకు శ్రేష్టంగా ఉందో మనం తెలుసుకోవాలి.
ఒక సర్వే ప్రకారం మనిషికి వచ్చే అనారోగ్య సమస్యల్లో 45 శాతం సమస్యలు అతడు తీసుకునే ఆహారం వల్లే వస్తుందని అంటున్నారు.మనిషి ఆహారం తీసుకునేప్పుడు జాగ్రత్త పడకుండా తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పెద్దలు వైధ్యులు సూచించిన దాని ప్రకారం ఈ క్రింది ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.వాటిని కాస్త జాగ్రత్తగా పరిశీలించి ముందు ముందు జాగ్రత్తలు తీసుకోండి.
తినబోయే ఆహారంలో కొన్ని రకాల పక్షులు ఉదాహరణకు కాకులు, గద్దలు, పిచ్చుకలు ఇంకా గబ్బిలం మూతి పెడితే ఆ ఆహారం తినకూడదు.ఆ ఆహారం విషంగా మారుతుంది.ప్రాణాలకు ప్రమాదం కాకపోయినా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇక జంతువులు అయిన కుక్క, పిల్లి, గాడిద, గుర్రం వాసన చూసిన, నోరు పెట్టిన ఆహారంను కూడా తినడం అనారోగ్యం.
ఒకసారి పాలతో అన్నం తిన్న తర్వాత మళ్లీ పెరుగుతో అన్నం తినకూడదు.ఒకవేళ పాలతో తిన్న తర్వాత పెరుగన్నం తినడం వల్ల కడుపులో రియాక్షన్ జరిగి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
పాలతో అన్నం తిన్న తర్వాత లేదంటే పాలను తాగిన తర్వాత కనీసం రెండున్నర గంటల తర్వాత పెరుగన్నం తినాలి.
రాత్రి మిగిలి పోయిన అన్నం శుభ్రంగా ఉంటే తినవచ్చు, కాని దాన్ని వేడి చేసుకుని తినాలనే ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు.
పచ్చడిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో 20 రోజుల కంటే ఎక్కువగా ఉంటే అది దాని రుచి కోల్పోవడంతో పాటు, అది విషతుల్యం అయినట్లుగా భావించాలి.
భోజనంలో బల్లి బొద్దింక వంటివి పడ్డా కూడా అవి ఎంత మాత్రం మంచిది కాదు.కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం అవొచ్చు.అందుకే తినే ముందు కాస్త జాగ్రత్తగా తినాలని పెద్దలు అంటున్నారు.