చుండ్రును ఒక్క వాష్ లో పోగొట్టే సూపర్ పవర్ ఫుల్ టోనర్ మీ కోసం!

ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మంది ఫేస్ చేసే సమస్యల్లో చుండ్రు ( Dandruff ) ఒకటి.అందులోనూ ప్రస్తుత ఈ వర్షాకాలంలో చుండ్రు సమస్య అనేది మరింత ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది.

 A Super Powerful Toner That Gets Rid Of Dandruff In Just One Wash Details, Dand-TeluguStop.com

వర్షాల్లో తరచూ తడవడం ఇందుకు ప్రధాన కారణం.ఏదేమైనా కూడా చుండ్రు అనేది తీవ్రమైన అసౌకర్యాన్ని, చికాకును కలగచేస్తుంది.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఒక్క వాష్ లోనే చుండ్రును పోగొట్టే సూపర్ పవర్ ఫుల్ టోనర్ ఒకటి ఉంది.

ఈ టోనర్ ను కనుక వాడితే చుండ్రు అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోనర్ ను( Toner ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు,( Flax Seeds ) నాలుగు బిర్యానీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.ఆ తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.

మరుసటి రోజు ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Dandruff, Care, Care Tips, Healthy Scalp, Homemade, Latest, Powerful-Telu

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ అనేది రెడీ అవుతుంది.ఈ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ టోనర్ ఆల్మోస్ట్ ఒక్క వాష్ లోనే చుండ్రు మొత్తాన్ని దూరం చేస్తుంది.

ఒకవేళ చుండ్రు మీకు మరీ ఎక్కువగా కనుక ఉంటే మరో రెండు సార్లు ఈ టోనర్ ను వాడండి.చుండ్రును సంపూర్ణంగా వదిలించుకోండి.

Telugu Dandruff, Care, Care Tips, Healthy Scalp, Homemade, Latest, Powerful-Telu

పైగా ఈ టోనర్ చుండ్రును పోగొట్టడానికి మాత్రమే కాదు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ దూరం అవుతుంది.కురులు ఒత్తుగా, సిల్కీ గా సైతం మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube