ఎవరిని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి?

“ప్రార్థన”అంటే “యాచనం” లేక అడగడం.ప్రార్థి అంటే వేడుకునే వాడు, అడిగేవాడు.

 To Whom Should We Pray , Devotional , Prarthana ,  Prarthinchatam ,  Telugu Devo-TeluguStop.com

కాబట్టి “ప్రార్థించు”… అంటే “అడుగు” అని అర్థం వస్తుంది.ఇది ప్రాచ్య భాషలలోని వివరణ.

దాదాపుగా ప్రపంచంలోని భాషలలోనూ ప్రార్థన.ఆయా భాషలలో సమాన అర్థక శబ్దాలు అంటే వేడు కొనుట, యాచించుట అని అర్థం.

అడగటం (వేడుకోవటం) అన్నది నిరూపితం అయింది.కాబట్టి రెండవ ప్రశ్న ఎవర్ని అడగాలి అన్నది వస్తుంది.

వేడుకునే వాడికి ఏది కావాలో అది ఇవ్వగలిగిన వాడిని అడగాలి. నీరు కావాల్సి వచ్చి నప్పుడు మేఘుణ్ణి అడగాలి.

అంతేకాని అగ్నిని అడిగితే లాభం ఉండదు కదా.అలాగే అగ్ని కావాల్సి వచ్చినప్పుడు మేఘుడి దగ్గరకు వెళ్తే… వర్షాన్ని, నీటిని ఇవ్వగలడే తప్ప అగ్నిని ఇవ్వలేడు.అలాగే మనకు కావాల్సిన దానిని ఎవరైతే ఇవ్వగలలో వాళ్లనే మనం అవి అడగాలి.

అర్థిలోని దైన్యం, అవసరం గుర్తించగల ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి.

ఆయన మాత్రమే మనలోని నిజాయితీని దర్శించగలడు.ప్రార్థన చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అందుకే ‘అర్థి అవసరం’ అర్థి యొక్క మనస్సు భగవంతుడు మాత్రమే చూడగలడు.ఆయన సర్వాంతర్యామి ప్రార్థన చేయగా.‘అహం’ పూర్తిగా నశించదు.అహం నశిస్తున్న కొలదీ “ప్రార్థనలో” తల్లీనత పెరుగుతుంది.

ఆ తల్లీనత లక్ష్య సిద్ధి వైపు ఏకాగ్రత చేకూరుస్తుంది.మనస్సును నిష్కల్మషంగా చేస్తుంది.

అప్పుడు అర్థి ఆశయం ఫలిస్తుంది.ప్రార్థన చేయాలిసిన అవసరం “లక్ష్యం” వైపు చిత్త శుద్ధితో పయనించటానికే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube