ఆడపిల్లలకి పుట్టింటి మీద చాలా ఆశ ఉండడం వలన ఎక్కువగా పుట్టింటికి వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తారు.కానీ ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఆడపిల్లలు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను తీసుకు వెళ్ళకూడదు.
అలా ఏ వస్తువులను తీసుకెళ్లకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఆడపిల్లలు పుట్టింటికి వచ్చిన ప్రతిసారి కంటికి కనిపించిన ప్రతి వస్తువు తన ఇంటికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
అందరూ ఆడ పిల్లలు కాకపోయినాప్పటికీ కొంతమంది ఆడపిల్లలు ఈ విధంగా చేస్తుంటారు.ఆడపిల్ల తల్లితండ్రులు కూడా తమ ఆడపిల్ల బాధపడకూడదని ఆమె అడిగిన ప్రతి వస్తువును ఇచ్చి పంపిస్తారు.
అయితే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు.
![Telugu Curd, Devotional, Lakshmi Devi, Milk, Salt, Tamarind, Vasthu, Vasthu Tips Telugu Curd, Devotional, Lakshmi Devi, Milk, Salt, Tamarind, Vasthu, Vasthu Tips](https://telugustop.com/wp-content/uploads/2023/07/girls-Salt-milk-devotional-Tamarind.jpg)
అలా తీసుకొని వెళ్లడం వలన ఏం జరుగుతుందో మీకు తెలుసా.? అలా చేయడం వలన పుట్టింటి వాళ్ళు ఇబ్బందులు పాలవుతారని తెలుసా.? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకు సరుకులు కూడా పంపిస్తుంటారు.కానీ ఆ సరుకులలో ఉప్పు( Salt ), చింతపండు లేకుండా చూసుకోవాలి.ఎందుకంటే వీటిని తీసుకుపోవడం వలన రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి.ఇక కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు కూడా పుట్టింటి నుంచి తీసుకొని అత్తింటికి వెళ్ళకూడదు.
ఇలా చేయడం వ లన ఇరు కుటుంబాల వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడి పగలు ప్రతీకారాలు పెరుగుతాయి.అలాగే చేట, చీపురు కూడా పుట్టింటి నుంచి పట్టుకుని వెళ్ళకూడదు.
![Telugu Curd, Devotional, Lakshmi Devi, Milk, Salt, Tamarind, Vasthu, Vasthu Tips Telugu Curd, Devotional, Lakshmi Devi, Milk, Salt, Tamarind, Vasthu, Vasthu Tips](https://telugustop.com/wp-content/uploads/2023/07/LAKSHMI-DEVi-girls-Salt-Curd-milk-devotional-Tamari.jpg)
ఈ రెండు లక్ష్మీదేవి( LAKSHMI DEVi )కి చిహ్నాలు.కాబట్టి వీటిని తీసుకొని పోవడం వలన పుట్టింటి వారు పేదరికం పాలవుతారని తెలుసుకోవాలి.అగ్గిపెట్ట కూడా పుట్టింటి నుంచి తీసుకొని వెళ్ళకూడదు.అంతేకాకుండా పుట్టింటి నుంచి నల్ల బట్టలు, నూనె, పాలు, పెరుగు( Curd ),దూది,గొడుగు, లక్ష్మి రూపు, విసుర్రాయి, అద్దం లాంటి వస్తువులను తీసుకొని వెళ్ళకూడదు.
ఇక నూనెను పుట్టింటి నుంచి తీసుకురావడం వలన అత్తింటి వాళ్లకు అరిష్టము.ఉప్పు తెచ్చుకోవడం వలన పుట్టింటి వాళ్లకి అరిష్టము.అందుకే ఇలాంటి వాటిని తీసుకురావడం మంచిది కాదు.
DEVOTIONAL