తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి సీనియర్ హీరోయిన్ రాధ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె తెలుగుతోపాటు తమిళ, మలయాళం భాషల్లో అగ్ర హీరోయిన్‌గా రాణించారు.
ఇక రాధ మలయాళీ.అయితే రాధ నటిగా ఇండస్ట్రీలోకి రాక ముందే ఆమె అక్క అంబిక హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే అప్పటికి రాధ చిన్నపిల్ల.తన అక్కతో పాటు కలిసి సినిమా షూటింగ్స్ వెళ్లడంతో ఆమెకి నటనపై ఆసక్తి పెరిగింది.
అయితే రాధలోని ఉత్తమ నటిని బయటకు వెలికితీసింది ప్రముఖ దర్శకుడు భారతీరాజా.ఇక ఆయన ‘అలైగళ్ ఓయవుదిల్లై‘ తమిళ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు కొత్త నటి కోసం అన్వేషిస్తున్న రోజుల్లో ఎడిటర్ ప్రకాశ్ ఒకసారి రాధ వాళ్ల ఇంటికి వెళ్లారు.
ఆయన రాధ, ఆమె అక్కలు మల్లిక, అంబిక కలిసి తీయించుకున్న ఫొటో చూసి, “ఈ ఫొటో భారతీరాజాకి చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళారంట.అలా ఆయన ఆ ఫొటో భారతీరాజాకు చూపించడం, ఆయన రాధ ఫొటో చూసి ఒకే చెప్పరంట.
ఆ తరువాత భారతీరాజా కెమెరామేన్ కణ్ణన్‌ను వెంటపెట్టుకొని రాధవాళ్ల ఊరు తిరువనంతపురంకు స్వయంగా వెళ్ళారంట.

ఇక రాధ వాళ్లింటికి వెళ్లి ఆమెను చూసి, తన హీరోయిన్ ఆమే అని నిర్ణయించుకొని, మద్రాస్ రమ్మని చెప్పారంట.అయితే ఆ సందర్భంలోనే భారతీరాజా, భాస్కర్, “ఈ కొత్త అమ్మాయే మన సినిమాలో హీరోయిన్” అని ఇళయరాజాకు పరిచయం చేశారంట.ఇక అలా ఆ సినిమాలో నటించడం ద్వారా హీరోయిన్‌గా రాధ పరిచయమైంది.
ఆమెకు తొలి సినిమాతోటే ఉత్తమనటి అవార్డును అందుకున్నారు.

అంతేకాక.ఆ కాలంలో ఎన్నో చిత్రాల్లో నటించి, ‘రాధ కేవలం గ్లామరస్ యాక్ట్రెస్’ అని ముద్రపడిన సందర్భంలో ‘ముదల్ మరియాదై‘ (తెలుగులో ‘ఆత్మబంధువు’) తమిళ చిత్రం ద్వారా ‘రాధ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు.ఇక మంచి అవకాశం లభిస్తే గ్లామర్ ప్రాధాన్యంలేని పర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా పోషించి, న్యాయం చేకూర్చి రాణించగల శక్తిసామర్థ్యాలున్న నటి’ అని నిరూపించింది కూడా భారతీరాజ అనే చెప్పాలి మరి.