సుడిగాలి సుధీర్ పెళ్లి సీక్రెట్ చెప్పేసిన ఆటో రామ్ ప్రసాద్.. ఏం జరిగిందంటే?

కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడి తర్వాత రోజుల్లో కమెడియన్ గా సుడిగాలి సుధీర్ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే 34 సంవత్సరాల వయస్సు వచ్చినా సుడిగాలి సుధీర్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

 Getup Srinu And Auto Ramprasad Comments About Sudigali Sudheer , Auto Ram Prasad-TeluguStop.com

సుడిగాలి సుధీర్ పెళ్లి ఎప్పుడనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో ఆటో రామ్ ప్రసాద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ నెల 22వ తేదీన రాఖీ పండుగ అనే సంగతి తెలిసిందే.అదే రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం గమనార్హం.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి డ్రామ కంపెనీలో చిరంజీవి పాటలకు డ్యాన్స్ లు చేశారు.నటుడు పృథ్వీ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరు కాగా శివజ్యోతి పృథ్వీతో పెళ్లి చేసేయండి అన్నయ్యా అని చెప్పగా పృథ్వీ ఆల్రెడీ చేశానమ్మా సినిమా పెద్ద హిట్టైంది అని చెబుతాడు.

సుధీర్ అక్క తనకు, సుధీర్ కు ఏజ్ గ్యాప్ సంవత్సరం మాత్రమేనని తాను, సుధీర్ సిస్టర్ బ్రదర్ లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటామని చెప్పుకొచ్చారు.ఇదీ అదీ అని కాకుండా అన్ని విషయాలను సుడిగాలి సుధీర్ తనతో షేర్ చేసుకుంటాడని సుధీర్ అక్క చెప్పారు.

వెంటనే గెటప్ శ్రీను ఈ మధ్య చెబుతున్నాడా అని అడగా చెప్పట్లేదని సుధీర్ అక్క చెబుతుంది.తాను మొత్తం చెబుతానని గెటప్ శ్రీను ఆ షో కామెంట్ చేస్తాడు.

Telugu Auto Ram Prasad, Getup Srinu, Jabrdasth, Secret, Ramprasad-Movie

అక్క ఇప్పటికి మూడుసార్లు సుధీర్ పెళ్లి కోసం ఇక్కడికి కెనడా నుంచి వచ్చిందని అక్క ఫ్లైట్ ఛార్జీలకు కన్నం అని ఆటో రామ్ ప్రసాద్ అన్నారు.ఆ డబ్బులతో ఇప్పటికి సుధీర్ కు మూడు పెళ్లిళ్లు అయ్యేవని ఆటో రామ్ ప్రసాద్ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube