జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించడానికి రెడీ అయ్యారు.జులై మొదటి తారీకున పవన్ పిఠాపురం పర్యటన ఖరారు అయ్యింది.
ఆరోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహించి తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు.అనంతరం మూడు రోజులు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా పిఠాపురం ( Pithapuram ) పర్యటనకి ముందు ఈనెల 29న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు.ఏపీ ఎన్నికలలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం ( Deputy CM )పదవితో పాటు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో పలు ఉన్నతాధికారులతోపాటు ఇతర శాఖ మంత్రులతో సమావేశాలు కావడం జరిగింది.కాగా ఎన్నికలలో గెలిచినా అనంతరం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించడానికి రెడీ కావటంతో స్థానిక నేతలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలకడానికి రెడీ అవుతున్నారు.