తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు దేశ నల మూలాల నుంచి ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అలాంటి తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండ పై మూడు కంపార్ట్మెంట్ల లో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వ దర్శనం కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.సోమవారం రోజు స్వామి వారిని దాదాపు 65,000 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇంకా చెప్పాలంటే దాదాపు 24 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకుల ద్వారా హుండీ ఆదాయం రూ.నాలుగు కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.అంతే కాకుండా ఒంటి మిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి దేవాలయంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరబ్రహ్మం విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 5వ తేదీన శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని మొదలుపెట్టామని కూడా వెల్లడించారు.కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు అయ్యే అవకాశం ఉండడం వల్ల వైఎస్ఆర్ జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.