మన తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో మద్దిమడుగు పుబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారులలో దట్టమైన నల్లమల అడవి పరిసర ప్రాంతాల్లో దివ్య మహిమాన్విత ప్రకృతి అందాల మధ్య ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది.
కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.దేవాలయం ప్రక్కన కోట పై వెలిసిన అమ్మవారిని కోట మైసమ్మగా భక్తులు పూజిస్తూ ఉంటారు.
ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.అయితే అంజనేయ స్వామి మాల ధరన చేపట్టిన స్వాములు ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు దేవాలయ ఆవరణలో మాలవిరామలను పూర్తి చేసుకున్నారు.
నాలుగు వ తేదీన ఉదయం నిత్యార్చన విగ్నేశ్వర పూజ పుణ్య హవాచనం, పంచగవం, ఎగశాల ప్రవేశం విగ్నేశ్వర పూజ ధ్వజరోహణం స్వామివారికి ఉష్ణ వాహన సేవ చేశారు.ఐదవ తేదీ విఘ్నేశ్వర పూజ, పంచకం, వాస్తు పూజ హోమం, రుద్ర హోమం, స్వామి వారి సహస్రచన బలిహరణ, నిరజన మంత్రపుష్పం, హనుమాన్ వ్రతం సాయంత్రం నిత్యోపసన మన్య సూక్త హోమం, పరిహారనా రాత్రికి అశ్వవాహన సేవ ఎంతో ఘనంగా వైభవంగా చేశారు.
ఆరవ తేదీన నిత్యవసరములు బలిహరణ రాత్రికి శివపార్వతుల కళ్యాణం మంగళహారతి, గజవాహన సేవ ఏడవ తేదీన రాత్రి కి సీతారాముల కళ్యాణం గరుడ వాహన సేవ, ఎనిమిదవ తేదీన ఆంజనేయ స్వామికి 108 కళశాలతో మహాకుంభాభిషేకాన్ని ఎంతో ఘనంగా వైభవంగా చేయడం జరిగింది.అలాగే హనుమాన్ గాయత్రీ మహా యజ్ఞం పూర్ణాహుతి కూడా ఇక్కడ ఎంతో ఘనంగా చేస్తారు.ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు భక్తులకు తాగినీటి సౌకర్యం వీడిది దర్శనం కోసం ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేసి ఈ కార్యాన్ని నిర్వహించారు.శ్రీ ఆంజనేయ స్వామి మహా కుంభాభిషేకానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ వారు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.