మన భారతదేశంలో పురాతనమైన ఎన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి పూజలు, అభిషేకాలు, హోమాలు జరిపిస్తూ ఉంటారు.
అలాగే మరి కొంత మంది భక్తులు( Devotees ) తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు.ఇలా దేవాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తే మనసుకు ఏదో తెలియని సంతృప్తి ఉంటుందని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఏదైనా బాధగా అనిపించినా చాలా మంది ప్రజలు దేవాలయానికి వెళుతుంటారు.
అలాగే దేవాలయానికి వెళ్లి వారికి ఉన్న బాధను భగవంతునితో( God ) చెప్పుకొని బాధపడుతూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే మరికొందరు దేవాలయానికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.అయితే కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది.భగవంతుని వద్ద ఏడవడం మంచిదా, కాదా అని చాలామంది సందేహ పడుతుంటారు.అయితే భగవంతుడి దగ్గరకు వెళ్లి ఏడవడం( Crying ) మంచిదే అని పండితులు చెబుతున్నారు.
ఎందుకంటే కొంతమంది వేరే వాళ్లకు తమ బాధ చెప్పుకోలేక లో లోపల కుమిలిపోతూ ఉంటారు.

ఎందుకంటే మన బాధ( Problems ) ఇతరులకు చెబితే వారు హేళన చేస్తారని ఎవరికీ చెప్పుకోవడానికి చాలామంది ప్రజలు ఇష్టపడరు.అలాగే వారు తమ మనసులోనే బాధను అలాగే పెట్టుకుని లో లోపల ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.అయితే అలాంటివారు భగవంతుని వద్ద తమ బాధను చెప్పుకొని ఏడవడం వల్ల మనసు తేలిక పడుతుంది.
ఒక వేళ తన కోరిక తీరిన భగవంతుడే తీర్చాడని భావిస్తూ ఉంటారు.

కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లి మన యొక్క బాధని చెప్పుకుని ఏడవడం కూడా మంచిదే అని పండితులు చెబుతున్నారు.మనసు కాస్త తేలిక పడితే మనపై ఉన్న ఏదో భారం తగ్గిపోయిందని అనిపిస్తూ ఉంటుంది.అలాంటి బాధ దూరమైపోతే హాయిగా ఉండవచ్చు.
అలాగే పాజిటివ్ గా మాట్లాడడం వల్ల మంచి ఎనర్జీ కూడా వస్తుంది.కాబట్టి మన బాధలను భగవంతుని ముందు చెప్పడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.