ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ధర్మం( Hindu Dharmam )లో భగవంతుని ఆరాధన, దేవాలయ ప్రవేశం, పూజలు, హోమ హవనానికి సంబంధించి అనేక నియమాలు, నిబంధనలు ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు దేవాలయానికి వెళ్లాలనుకున్నప్పుడు వారు తమ రోజువారి కర్మలను ముగించి, స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరిస్తారు.
స్నానం చేయకుండా దేవాలయానికి అస్సలు వెళ్ళరు.స్నానం చేసి దేవాలయానికి వెళ్లడానికి కూడా ఒక కారణముంది.
స్నానం చేయడం వల్ల శరీరం మరియు మనసు రెండు పరిశుభ్రమవుతాయి.నిర్మలమైన మనసుతో భగవంతు( Praying God )ని ప్రార్థిస్తే ఆ భగవంతుని అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుంది.
మనం రాత్రి నిద్ర పోయేటప్పుడు కొంత ప్రతికూల శక్తి మనలోకి ప్రవేశిస్తుంది.స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ( Negative Energy )తో దేవాలయంలోకి ప్రవేశిస్తాం.అదే స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయానికి వెళ్లిన తర్వాత దేవుడి దర్శనం, దేవుడిని ప్రార్థించడం, ధ్యానం చేసి పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి తిరిగి వస్తాం.గుడి( Temple ) నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
అలాగే డైరెక్ట్ గా కాళ్లు కూడా కడగకూడదని చెబుతున్నారు.వీటికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
ఆ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దేవాలయానికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.అలాగే పాజిటివ్ ఎనర్జీ( Positive Energy )తో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే అది దూరమైపోతుంది.భగవంతుని దర్శన పుణ్యం కూడా పూర్తిగా లభించదు.ఆలయానికి వెళ్లి పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.వెంటనే తలస్నానం చేస్తే ఈ వరం కూడా సరిగా లభించదు.
అంతేకాకుండా సాధారణంగా ఏదైనా అశుభ కార్యం తర్వాత స్నానం చేస్తారు.మరణ గృహాన్ని సందర్శించినప్పుడు లేదా అశుభ ప్రదేశం నుంచి వచ్చినప్పుడు స్నానం చేయాలి.
అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలని అలా చేస్తూ ఉంటారు.దేవాలయానికి వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేస్తే దేవుడిని అవమానించినట్లే అని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL