సూర్యాస్తమయం తర్వాత అసలు ఇలాంటి పనులు చేయకూడదు.. కారణం

సాధారణంగా ఇంట్లో పెద్దవారు కొన్ని పద్ధతులను, నియమాలను చాలా సంప్రదాయంగా పాటిస్తూ ఉంటారు.అందులో భాగంగానే సూర్యస్తమయం తర్వాత కొన్ని పనులు చేయరాదని చెబుతూ ఉంటారు.

 Such Things Should Not Be Done After Sunset.. Reason, Sunset , Devotional , Fina-TeluguStop.com

వాటికి కారణాలు తెలియకపోయినా పెద్దవాళ్ళు చెబుతారు కదా అని చాలామంది వీటిని పాటిస్తూ ఉంటారు.ఇవి కేవలం వాళ్ళు చాదస్తంతో చెప్పేవి మాత్రం కాదు.

కొన్ని గ్రంథాల్లో ఈ మాటలు ప్రస్తావించబడినవే.సూర్యస్తమయం తర్వాత ఈ పనులు చేయడం వల్ల వ్యక్తికి దురదృష్టం కలుగుతుందని చెబుతారు.

దీనితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.వాస్తు శాస్త్రంలో పేర్కొన్న చేయకూడని పనులు కూడా ఉన్నాయి.

అలాంటి పనులు సూర్యాస్తమయం తర్వాత చేస్తే శ్రీ మహాలక్ష్మికి కోపం వస్తుందని, భాగ్యలక్ష్మి మద్దతు ఉండకుండా అయిపోతుందని పండితులు చెబుతున్నారు.సూర్యాస్తమయం తరువాత ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యాస్తమయం తర్వాత పసుపు ఎప్పుడు దానం చేయకూడదు.ఎందుకంటే సాధారణంగా పసుపును శుభకార్యాలలో ఉపయోగిస్తారు.మరోవైపు పసుపు నేరుగా బృహస్పతి తో సంబంధం కలిగి ఉంటుంది.ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే బృహస్పతి ఆఇష్టం పొంది ఇంట్లో ఆర్థిక అభివృద్ధి నిలిచిపోతుంది అని చెబుతారు.

చీపురు లక్ష్మి స్వరూపం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

Telugu Broom, Devotional, Financial, Lakshmi Devi, Sunset, Turmeric Powder, Vast

సాయంత్రం సమయంలో ఇంట్లో చెత్తను శుభ్రం చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కలత చెందుతుందని చెబుతూ ఉంటారు.ఇంట్లో చెత్త చెదారం ఉంటే సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి ఇంటికి రాదని చెబుతారు.

సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దృష్ట శక్తులు చేరే అవకాశం ఉంది.అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుగా ఉండడం మంచిది.

సూర్యాస్తమయం తర్వాత గోర్లు, జుట్టు అసలు కత్తిరించకూడదు.ఇలా చేయడం వల్ల జీవితం పై చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube