హిందూ ధర్మం( Hindu Astrology )లో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ఎప్పుడూ ఉండాలంటే ఏ ఏ వస్తువులు ఏ దిక్కున ఉంచాలి అనే విషయాల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
వాస్తు శాస్త్రంలో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి.వాస్తు ప్రకారం నడుచుకుంటే జీవితంలోనీ కష్టాలలో చిక్కుకునే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
వాస్తు శాస్త్రం( astu )లోనీ నియమాలను పాటించడం వల్ల ఆర్థిక సంక్షోభాల నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రంలో మంచం కూడా ఉంటుంది.కొన్ని వస్తువులను మంచం కింద ఉంచితే అప్పుడు ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.మంచం కింద ఉంచకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మంచం కింద చీపురు ఉంచడం అశుభంగా భావిస్తారు.మంచం కింద చీపురు ఎప్పుడు ఉంచకూడదు.
చీపురు( Broom ) మనస్సు, మెదడు పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇది మాత్రమే కాకుండా దీని వల్ల ఇంట్లోని వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే మంచం కింద బంగారం, వెండి అలాగే లోహపు ఆభరణాలను అస్సలు ఉంచకూడదు.దీనితో పాటు బూట్లు, చెప్పులు కూడా ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీ మంచం కింద తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను ఉంచకూడదు.దీని వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
మంచం కింద ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు ఉంచకూడదు.దీని వల్ల మానసిక ఆరోగ్యం( Health Issues ) దెబ్బతినే అవకాశం ఉంది.
దీనితో పాటు నిద్రలేమి లాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి.
DEVOTIONAL