ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.50
రాహుకాలం:మ .12.00 ల1.30
అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది
దుర్ముహూర్తం:ఉ.11.57 ల12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.తోబుట్టువులతో దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీరు చేపట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరిక లేని సమయంలో గడుపుతారు.ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.
మిథునం:

ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీరంటే గిట్టని వారు అనవసరమైన విషయాలలో తలదూరుస్తారు.ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటకం:

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కోర్టు సమస్యల నుండి బయట పడతారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకొంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆలోచనలో కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.
సింహం:

ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొందరు గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
కన్య:

ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.బంధు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.
తులా:

ఈ రోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటి నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తారు.
వృశ్చికం:

ఈ రోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొందరు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఇతరుల విషయంలో తల దూరకుండా ఉండటం ఉండాలి.
ధనస్సు:

ఈరోజు మీరు అనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
మకరం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి.అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.
ఇరుగు పొరుగువారితో వాదనలకు దిగకండి.మీరు ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా నిదానంగా పూర్తవుతుంది.
కుంభం:

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.చెడు సావాసాల కు దూరంగా ఉండటం మంచిది.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు.తల్లిదండ్రులతో కలసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టనివారు మీపై నిందలు మోపుతారు.
కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.వ్యాపారం పట్ల నష్టపోయే అవకాశం ఉంది.