టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన సుమకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.గతంతో పోలిస్తే సుమ హోస్ట్ గా చేసే షోల సంఖ్య తగ్గినా ఈవెంట్లు మాత్రం తగ్గడం లేదు.
ఏ స్టార్ హీరో ఈవెంట్ అయినా సరే సుమ హోస్ట్ గా ఉండాల్సిందే.సుమకు కాకుండా వేరే యాంకర్లకు ఛాన్స్ ఇస్తే ఆ యాంకర్లు సుమ స్థాయిలో మెప్పించడంలో విఫలవుతున్నారు.
సుమకు పోటీనిచ్చే యాంకర్ బుల్లితెరపై లేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఒక విషయంలో మాత్రం సుమ తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
గతంలో సుమపై ఈ తరహా విమర్శలు ఎప్పుడూ వ్యక్తం కాలేదనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియా కామెంట్లను దృష్టిలో ఉంచుకుని సుమ జాగ్రత్త పడాల్సి ఉంది.
వయస్సు పెరుగుతుండటం వల్లే సుమకు ఆఫర్లు తగ్గుతున్నాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.సుమ నటించి గత నెలలో విడుదలైన జయమ్మ పంచాయితీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
సుమకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నా ఈ సినిమాకు నామమాత్రపు కలెక్షన్లు రాలేదు.బుల్లితెరపై స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న సుమ వెండితెరపై సత్తా చాటే విషయంలో ఫెయిలవుతున్నారు.

జయమ్మ పంచాయితీ సక్సెస్ సాధిస్తే మరిన్ని సినిమాలలో నటించాలని సుమ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.సుమ రాబోయే రోజుల్లో సినిమాల్లో నటనకు దూరంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి రోల్స్ లో మాత్రం సుమ సినిమాల్లో నటించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది.