1.ఫిలిం ఛాంబర్ లో తారకరత్న పెద్దకర్మ
సినీ హీరో నందమూరి తారక రత్న పెదకర్మను ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో కుటుంబ సభ్యులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.
2.ఫేస్ రికగ్నిషన్ యాప్ పై టిటిడి ఈవో కామెంట్స్
తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
3.లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు .పులకేసి లోకేష్ ఓ మాలోకమని, ఆయన యువ గళం జనం లేక వెలవెలబోతోందని అనిల్ విమర్శించారు.
4.ప్రతిపక్షాలకు షర్మిల లేఖ
తెలంగాణలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామని ప్రతిపక్షాలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల లేఖ రాశారు.
5.జగన్ గుంతల పథకం అంటూ లోకేష్ కామెంట్స్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది ఈ సందర్భంగా రోడ్లపై గుంతలు కనిపించడంతో అక్కడ సెల్ఫీ దిగిన లోకేష్ జగన్ గుంతల పథకం అంటూ సెటైర్లు వేశారు.
6.తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళల ధర్నాలో పాల్గొన్నారు.పెరిగిన గ్యాస్ ధరలపై ఆయన మండిపడ్డారు.ప్రధానిగా మోదీ వెంటనే దిగిపోవాలని పాలించే హక్కు లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
7.ఎంపీ అవినాష్ రెడ్డి పై కేసు కొట్టివేత
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై ఉన్న పాత కేసును విజయవాడ కోర్టు కొట్టివేసింది.
తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట 2017లో ధర్నా చేపట్టిన కేసు నమోదు కాగా , దీనిపై ఈరోజు విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు.సరైన సాక్ష్యం లేని కారణంగా ఈ కేసును కొట్టు వేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
8.జనసేన తో కలిసి పోటీ : బిజేపి
రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
9.గ్యాస్ ధరల పెంపు పై బి ఆర్ ఎస్ ఆందోళన
గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
10.నేడు టీ వర్క్స్ ప్రారంభం
నేను హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో టీ వర్క్స్ ప్రారంభమైంది .100 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.
11.తెనాలిలో నాదెండ్ల మనోహర్ పర్యటన
నేడు గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు.
12.గ్లోబల్ సమ్మిట్ పై గంటా కామెంట్స్
రేపటి నుంచి విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ కు లేఖ రాశారు పెట్టుబడుల సదస్సుకు ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ జగన్ కు గంటా లేఖ రాశారు.
13.అమరావతి కేసులపై విచారణ
రాజధాని అమరావతి కి సంబంధించిన కేసుల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.మార్చి 28న ఈ కేసు విచారణ చేపడతామని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
14.ఆదాని వ్యవహారంపై నిపుణుల కమిటీ
ఆదాని – ఇండియన్ బర్గ్ వివాదంపై నిపుణుల కమిటీ ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
15.ఈసీల నియామకాలపై సుప్రీం తీర్పు
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఎన్నికల సంఘంలో నియామకాలను ప్రధాని , లోక్ సభపక్ష నేత సీజే సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది.
16.జగన్ పై రేణుక చౌదరి కామెంట్స్
అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి అన్నారు.రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయల మారిందని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు.
17.ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై కేటీఆర్ ట్వీట్
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు .విశాఖలో ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
18 అఖిలభారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
ఆల్ ఇండియా పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్ 2023 నేటి నుంచి హైదరాబాదులో ప్రారంభం కానుంది.
19.నిమ్స్ ఉద్యోగుల నిరసన
తమకు న్యాయం చేయాలని కోరుతూ నిమ్స్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకుంది.