మందులు వాడినా మోకాళ్ళ నొప్పి త‌గ్గ‌డం లేదా? అయితే ఇలా చేయండి!

మోకాళ్ళ నొప్పి.కోట్లాది మందిని బాధ పెడుతున్న స‌మ‌స్య ఇది.ఒక‌ప్పుడు డ‌బ్బై, ఎన‌బై ఏళ్లు దాటిl వారిలోనే ఈ స‌మ‌స్య క‌నిపించేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో న‌ల‌బై ఏళ్ల వారు సైతం మోకాళ్ళ నొప్పితో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.

 Best Ways To Get Rid Of Knee Pain! Knee Pain, Knees, Latest News, Health, Health-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే కొంద‌రికి ఎన్ని మందులు వాడినా మోకాళ్ళ నొప్పి త‌గ్గ‌దు.ఒక‌వేళ త‌గ్గినా మ‌ళ్లీ వ‌చ్చేస్తుంటుంది.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే చింతించ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటే సుల‌భంగా మోకాళ్ళ నొప్పి నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.

మ‌రి లేటెందుకు ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో చూసేయండి.

మోకాళ్ళ నొప్పుల‌ను దూరం చేయ‌డంలో ఆకుకూర‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా పాల‌కూర‌, మున‌గాకు, మెంతికూర, తోట‌కూర, బ్రోక‌లీ వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను డైట్‌లో చేర్చుకుంటే.అందులో ఉండే ప‌లు పోష‌కాలు ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచి మోకాళ్ళ నొప్పుల‌ను నివారిస్తాయి.

అలాగే మోకాళ్ళ‌ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం ఎంతో అవసరం.క్యారెట్, బీట్రూట్, కాప్సికం, బీన్స్, అల్లం, పసుపు, ఉల్లి, న‌ట్స్ వంటి వాటిని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి.

Telugu Knee Pain, Bone, Tips, Knees, Latest-Telugu Health Tips

కొన్ని కొన్ని పండ్లు కూడా మోకాళ్ళ నొప్పుల‌ను త‌గ్గించ‌డానికి హెల్ప్ చేస్తాయి.యాపిల్స్, ఎండు ద్రాక్ష, కివి, అవ‌కాడో, చెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌, నారింజ‌, బొప్పాయి వంటి పండ్ల‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి.పాలిష్‌ చేసిన తెల్ల బియ్యం అన్నం, మైదా, చెక్క‌ర వంటి వాటికి దూరంగా ఉండాలి, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం, బేక‌రీ ఫుడ్స్‌, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌ను ఎవైడ్ చేయాలి.

మ‌ద్య‌పానం, ధూమపానం అల‌వాట్ల‌ను మానుకోవాలి.ప్ర‌తి రోజు చిన్న చిన్న వ్యాయామాలైనా చేస్తుండాలి.

త‌ద్వారా మోకాళ్ళ నొప్పుల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube