హెయిర్ బ్రేకేజ్( Hair breakage ).మగువల్లో చాలా మందిని మదన పెట్టే సమస్య ఇది.
పోషకాల కొరత, వాతావరణంలో వచ్చే మార్పులు, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూను వినియోగించడం, తడి జుట్టును దువ్వడం తదితర కారణాల వల్ల జుట్టు విరిగిపోతూ ఉంటుంది.అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు.
వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ బ్రేకేజ్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిరాకిల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
యాపిల్ సైడర్ వెనిగర్.
( Apple Cider Vinegar ) దీని గురించి పరిచయాలు అవసరం లేదు.వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారు నిత్యం మార్నింగ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటారు.
వెయిట్ లాస్ కు మాత్రమే కాదు బాడీని డిటాక్స్ చేయడానికి, షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి.ఇలా చెప్పుకుంటే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

అలాగే జుట్టు సంరక్షణకు కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది.హెయిర్ బ్రేకేజ్ కి అడ్డుకట్ట వేస్తుంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి.అలాగే రెండు ఎగ్ వైట్స్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు ముక్కలవడం, చిట్లడం వంటివి క్రమంగా తగ్గుముఖం పడతాయి.జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మారుతుంది.కుదుళ్ళు బలోపేతం అవుతాయి.మరియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.







