చిరంజీవి( Chiranjeevi ) హీరోగా 150 కి పైగా సినిమాల్లో నటించాడు ఆయన ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన కుటుంబం నుంచి కూడా పదుల సంఖ్యలో హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఇక తల సినిమాల్లో నటిస్తున్న క్రమంలో అపారమైన సినిమా విజ్ఞానమున్న చిరంజీవి తన దర్శకులకు ఎప్పుడు సలహాలు ఇచ్చేవారు కాదు.
తనతో పాటు ఎంతో మంది హీరోలు సినిమాల్లోకి వచ్చిన వారంతా కూడా దర్శకుడికి తనదైన సలహాలను ఇస్తూ వెళ్లారు.కానీ చిరంజీవి మాత్రం ఆ సాహసం చేయడానికి ఎప్పుడూ సిద్ధపడరు.
ఇక చిరంజీవి దర్శకుడు మాత్రమే ఒక కెప్టెన్ గా వ్యవహరిస్తారు అతడు సినిమా ఎలా చేయాలి అని ఒక ఆలోచనతో ప్రతి సన్నివేశాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు.
కానీ చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అనే విషయం చాలా మందికి తెలియదు.1991లో విడుదల అయిన గ్యాంగ్ లీడర్( Gang leader ) సినిమా అందరికి తెలుసు.ఈ సినిమాకు బాపినీడు దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్రంలో ఉన్న ఒక కీ సన్నివేశం ఆ చిత్ర విజయంలో కీలక బాధ్యతను నెరవేర్చింది.మురళీ మోహన్( Murali Mohan ) ఇది చంపేసే సమయంలో వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి.
సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో బాపినీడు తో పాటు చిరంజీవి కూడా కూర్చున్నారట సినిమా మొత్తం చూసిన చిరంజీవి మురళీమోహన్ చనిపోయిన సన్నివేశాలను మరోమారు చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారట.
ఆయన ఇచ్చిన సలహా మేరకు మురళీ మోహన్ చావు సన్నివేశాలను మరోమారు చిత్రీకరించాలని బాపునీడు ఒప్పుకున్నారట.అంతేకాదు సన్నివేశాలను చిరంజీవిని దర్శకత్వం వహించాలని కూడా బాపునీడు పోరాట దాంతో మెగా ఫోన్ పట్టి చిరంజీవి ఈ సన్నివేశాలను చిత్రీకరించి ఎడిటింగ్ లో మరోమారు జోడించి చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చాయట.దాంతో ఆ చిత్రాన్ని చిరంజీవి చిత్రీకరించిన సన్నివేశాలతోనే విడుదల చేశారట అలా చిరంజీవి మొదటిసారి మెగా ఫోన్ పట్టుకున్న సినిమా గ్యాంగ్ లీడర్.