సూర్య.బేసిక్ గా తమిళ్ హీరో.
మంచి సినిమాలు తీస్తున్నాడు కాబట్టి పక్క భాషల్లో కూడా డబ్ చేసి మంచి హీరో గా పేరు తెచ్చుకున్నాడు.తానొక్కడే కాదు తన తమ్ముడు కార్తీ కూడా అన్నకు తగ్గ తమ్ముడే.
వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ కి రావడానికి కారణం వీరి తండ్రి శివ కుమార్.సూర్యని సేల్స్ మేనేజర్ నుంచి హీరో గా చేయడానికి ఎంత కష్ట పడాల్సి వచ్చిందో గతంలో మనం కొన్ని ఆర్టికల్స్ లో రాసుకున్నాం.ఇప్పుడు ఆ ప్రస్తావనలోకి వెళ్లడం లేదు.చెప్పాచ్చే విషయం ఏంటి అంటే సూర్య ని మాత్రం అటు తమిళ ఇండస్ట్రీ తో పాటు మన తెలుగు ఇండస్ట్రీ ఎందుకు అంతగా ఆరడిస్తుందా అని.
అందమైన మొహం, మంచి టాలెంట్ ఉంటె సినిమాల్లో హీరో అవుతాడేమో కానీ అభిమానులకు ఫెవరెట్ హీరో మాత్రం కాలేడు.అందుకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి.
అవి పుష్కలంగా ఉన్న నటుడు సూర్య.దానాలు, ధర్మాలు, సామజిక సేవ ఎవరైనా చేయచ్చు.
కానీ ఇప్పుడు ప్రేక్షకులకు అస్సలు సిసలైన హీరో కావాలంటే బోలెడంత ఎలివేషన్స్ ఉండాలి ఉదాహరణకు కెజిఎఫ్(ఎలివేషన్స్ తోనే హిట్ అయ్యింది కాబట్టి).లేదంటే అందమైన లవ్ స్టోరీ ఉండాలి ఉదాహరణకు సీతారామం(పర్ఫెక్ట్ లవ్ స్టోరీగా హిట్ అయ్యింది).
కానీ ఇవేమి సూర్య బలం కాదు.నో ఎలివేషన్స్, నో లవ్ స్టోరీ, నో ఫైట్, నో ఫ్లాష్ బ్యాక్, నో కమర్షియల్ ఎలిమెంట్స్… వీటితో పాటు నో హీరోయిజం.

ఇవన్నిటికి దూరంగా తాను తీసిన జై భీం సినిమా.ఈ ఒక్క సినిమా చాలు సూర్య ఎందుకు మన అందరికి ఫెవరెట్ అని చెప్పడానికి.ఈ సినిమా విడుదల అయినప్పుడు ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి.కానీ అప్పటికి ఇప్పటికి సూర్య మరియు జ్యోతిక దంపతులు కెరీర్ తొలినాళ్లలో ఇమేజ్, డబ్బు అనే చట్రంలో ఇరుక్కున్న ఇప్పుడు అన్నిటిని అధిగమించి సినిమా ఇండస్ట్రీ కి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం తో సినిమాలు తీస్తున్నారు.
అందుకే జాతీయ అవార్డులు వారిని వెత్తుకుంటూ వస్తున్నాయి.అందుకే సూర్య అంటే అందరికి ఒక ప్రత్యేకమైన గౌరవం.ఇప్పటికి ఎప్పటికి సూర్య ఒక్క గొప్ప హీరో.అయన భవిష్యత్తులో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలి.