ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్.దేవుని కుమారుడిగా జన్మించి.
పరిశుద్ధంగా జీవించి లోక రక్షకుడిగా…మెస్సయ్య అనీ క్రైస్తవులు ఏసుక్రీస్తునీ నమ్ముతారు.ఈ క్రమంలో ఆయన జన్మదినోత్సవంగా డిసెంబర్ 25వ తారీకు నాడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
దీంతో సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తాజాగా ప్రముఖ సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మానవాళిలో ప్రేమ, కరుణ, శాంతి వెల్లివిరియ్యాలని ఆ గుణాలు ఉన్న మనిషి పరిశుద్ధులు అవుతాడని….తెలుపుతూ క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని బాలకృష్ణ తెలియజేశారు.పేదవాళ్లకు చేతనంత సాయం చేయాలని.బలహీనులను ఆదుకోవాలని, రోగులనీ… పరామర్శించాలని .ధైర్యం చెప్పాలని ఈ సందర్భంగా బాలకృష్ణ సూచించారు. ఇదిలా ఉంటే ఈనెల 20వ తారీకు ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత 21వ తారీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగని అధికారికంగా జరపడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… అధికారిక క్రిస్మస్ వేడుకల్లో.చాలామందికి బహుమతులు బహుకరించారు.