నిన్న థియేటర్లలో విడుదలైన ధమాకా ప్రస్తుతం మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూలతో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.అయితే ఈ సినిమాకు లాంగ్ రన్ కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన పాత చింతకాయ పచ్చడి లాంటి కథని మళ్లీ చూపించారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏ మాత్రం కొత్తదనం లేని కథలకు రవితేజ ఎలా ఓటేస్తున్నాడో అర్థం కావడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ధమాకా మూవీలో సీఎం జగన్ పై హైపర్ ఆది వేసిన పంచ్ హాట్ టాపిక్ అవుతోంది.సాధారణంగా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ అభిమాని అనే సంగతి తెలిసిందే.
హైపర్ ఆది పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.జనసేన పార్టీ తరపున హైపర్ ఆది ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాలో హైపర్ ఆది ఒక సందర్భంలో మాట్లాడుతూ “అప్పటినుంచి వేశారా లేదా వేశారా లేదా అంటున్నారు.ఒకటో తారీఖున శాలరీ వేశారా లేదా” అని పంచ్ వేశారు.
ఈ నెల ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా టీచర్లకు సకాలంలో జీతాలు జమ కాకపోవడం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.ఏపీ సర్కార్ కు సకాలంలో అప్పు దొరకకపోవడం వల్లే ఈ నెల జీతాలు ఆలస్యం అయ్యాయి.ధమాకా మూవీలో ఇప్పటికే పలు డైలాగ్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.అయితే మేకర్స్ కు ఈ డైలాగ్స్ తెలిసి పెట్టారో లేక తెలియక పెట్టారో తెలియాల్సి ఉంది.
ధమాకా మూవీలో పంచ్ ల గురించి వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారేమో చూడాలి.అయితే సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్ పార్టీలకు వివాదాలు ఏ మాత్రం మంచిది కాదు.
గతంలో టికెట్ రేట్లకు సంబంధించి నెలకొన్న వివాదం వల్ల సినిమా ఇండస్ట్రీ కోట్ల రూపాయలు నష్టపోయింది.