తమలపాకులు వాడి మీ ఆర్థిక సమస్యలను అధిగమించండి

ఆర్థిక సమస్యలతో పాటు మొదలుపెట్టిన ప్రతి పనికీ అడ్డంకులు వస్తున్నాయా? వ్యాపారంలో వృద్ధి లేదా? ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదా? మీ సమస్యలకు పరిష్కారం చూస్తున్నట్లైతే ఇది మీ కోసమే.తమలపాకుల ఉపయోగం మీ సమస్యల పరిష్కారానికి కొంతైన ఉపయోగపడవచ్చు.

 Use Betel Nuts To Overcome Your Financial Problems, Devotional, Betel Nuts, Vara-TeluguStop.com

హిందూ సాంప్రదాయంలో తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఏ పూజలు చేసినప్పుడైనా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే.

పురణాల ప్రకారం.క్షీర సాగర మథనం వేళ దేవతలు తమలపాకులను ఉపయోగించిన విష్ణువుని పూజించారని తెలుస్తోంది.

ఆంజనేయస్వామికి కూడా తమలపాకులు ఎంతో ప్రీతిపాత్రం.తమలపాకులతో మాల తయారు చేసిన హనుమాన్‌ కు సమర్పిస్తారు.

ఆంజనేయుడిని పూజించే సమయంలో తమలపాకులు కచ్చితంగా ఉండాల్సిందే.ఈ తమలపాకులతో ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడం సహా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మంగళవారం లేదా శనివారం ఉదయం హనుమాన్ ఆలయానికి వెళ్లి తమలపాకులతో పూజ నిర్వహించాలి.తద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి.

వరలక్ష్మీ వ్రతాలు చేసేటప్పుడు కూడా తమలపాకులను విరివిగా ఉపయోగిస్తారు.తమలపాకులతోనే వాయినం ఇస్తారు.

ఆ తమలపాకులతోనే అమ్మవారిని కొలుస్తారు.ఇలా ప్రతి పూజలోనూ తమలపాకులను వాడుతుంటారు.

అలాంటి తమలపాకుల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.తమలపాకుల వినియోగం వల్ల అనేక సానుకూల ప్రభావాలు ఉన్నాయి.ఇంట్లో నిత్యం చేసే పూజా కార్యక్రమాల్లో తమలపాకులను ఆకులను దేవుళ్లకి సమర్పిస్తే దేవతలను సంతోషించిన్లు అవుతుందని… దాని వల్ల ప్రతికూలతలు తొలిగిపోయిఏ పని చేపట్టినా మంచే జరుగుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.వ్యాపారులు తమ దుకాణాలు, కార్యాలయాల్లో పెసర ఆకులు, తమలపాకులతో దండ తయారు చేసి, దానిని తూర్పు దిక్కున కట్టాలి.

ప్రతి శనివారం కొత్త ఆకులతో దండను కట్టాలి.పాత దండను కట్టి పారే నీటిలో నిమజ్జనం చేయాలి.ఇలా ఐదు శనివారాలు చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube