మన దేశంలో ఉన్న ప్రజలు ప్రతి పండుగను తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో వైభవంగా జరుపుకుంటారు.అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి( Durga Temple ) పై ఏర్పాట్లను అధికారులు పాలకమండలి సభ్యులు సమీక్షించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల్లో నుంచి సిబ్బందిని తీసుకువచ్చి ఇక్కడ వినియోగిస్తామని దుర్గా గుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు.అంతే కాకుండా ఉత్సవాలు జరిగే పది రోజుల్లో విధులు నిర్వర్తించేందుకు ఒప్పంద ప్రతిపాదికన మరికొంతమంది సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
అన్నదాన భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.ఉత్సవాలలో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 15వ తేదీ నుంచి వరుసగా పది రోజులపాటు అమ్మవారు బాల త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి, మహా చండీ, సరస్వతి, లలితా త్రిపుర సుందరి, దుర్గాదేవి, చివరి రోజు అయిన అక్టోబర్ 23వ తేదీన మహిషాసుర మర్దిని, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి( Sri Rajarajeshwari ) రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.
ఉత్సవాల సమయంలో వినాయకుడి దేవాలయం నుంచి క్యూ లైన్ లో మొదలవుతాయని ఈవో భ్రమరాంబ వెల్లడించారు.

ఎప్పటిలాగే 5 క్యూ లైన్ లు ఉంటాయని వెల్లడించారు.కేశఖండనకు 600 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు.భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించే షెడ్లు వేస్తున్నామని వెల్లడించారు.10 ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి.మోడల్ గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.
దర్శనానికి స్లాట్లు కూడా నిర్ణయిస్తాం.గత సంవత్సరంలో లాగానే భక్తుల( Devotees ) రద్దీ ఉంటుందని అనుకుంటున్నాం.
దసరా ఉత్సవాలు జరిగిన తొమ్మిది రోజులు అంతరాలయ దర్శనం ఉండదని ఈవో వెల్లడించారు.
LATEST NEWS - TELUGU