ఆ సీన్ ఎందుకు చేశానా అని ఇప్పటికీ బాధ పడుతున్న సదా.. అసహ్యం వేసిందంటూ?

టాలీవుడ్( Tollywood ) ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సదా ఒకప్పుడు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ కాగా ఇప్పుడు మాత్రం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవు.పలు టీవీ షోలకు సదా( sada ) జడ్జిగా వ్యవహరించినా పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదనే సంగతి తెలిసిందే.

 Star Heroine Sada Comments About Jayam Movie Details Here Goes Viral In Socia-TeluguStop.com

తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన జయం సినిమాతో ఈ నటి ప్రస్థానం మొదలైంది.నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించగా నితిన్ కు సైతం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఎందుకు యాక్ట్ చేశానా అని సదా ఇప్పటికీ బాధ పడుతున్నారట.గోపీచంద్( Gopichand ) ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.

జయం సినిమాలోని ఒక సన్నివేశంలో గోపీచంద్ నాలుకతో చెంపపై నాకుతాడని ఆ సీన్ నేను చేయనని చెప్పినా డైరెక్టర్ తేజ మాత్రం అస్సలు వినలేదని సదా కామెంట్లు చేయడం గమనార్హం.

జయం సినిమాకు ఆ సీన్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పి తేజ బలవంతంగా ఒప్పించారని ఆమె పేర్కొన్నారు.ఆ సీన్ షూట్ పూర్తైన తర్వాత ఇంటికి వెళ్లి ఏడ్చానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సీన్ తర్వాత చాలాసార్లు మొఖం కడుక్కున్నానని ఆమె తెలిపారు.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా ఆ సన్నివేశాలను మాత్రం చూడనని సదా చెప్పుకొచ్చారు.సదా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సదా పారితోషికం ప్రస్తుతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సదా రీఎంట్రీలో కూడా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో సదాకు వరుసగా భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.సినిమా సినిమాకు సదాను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube