సంక్రాంతి రోజు గంగిరెద్దులకు ఈ వస్తువులను దానం చేస్తే అరిష్టం.. ఆ వస్తువులేమిటో తెలుసా..

సంక్రాంతి రోజు రంగురంగు ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలతో పాటు

గంగిరెద్దులు

కూడా వీధులలో కనిపిస్తూ ఉంటాయి.గంగిరెద్దు వాళ్ళు బసవన్నలను అందంగా తయారు చేసి వీధులలో తిరుగుతూ ఉంటారు.

 If You Donate These Things To Gangireddhas On Sankranti Day, It Is Bad Luck.. Do-TeluguStop.com

వాటిపై రంగు రంగు చీరలు దుప్పట్లు కప్పుతారు.వాటి కొమ్ములను అందంగా తీర్చిదిద్దుతారు.

వాటితో పాటు జోలి పట్టుకుని పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ బిక్షం అడుగుతూ ఉంటారు.ఆ గంగిరెద్దులతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఇంటి యజమానులను ఆకర్షించి తోచినంత దానం చేయాలని వేడుకుంటూ ఉంటారు.

గంగిరెద్దును ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది డబ్బులు ఇస్తుంటారు.మరి కొంతమంది బియ్యం మరి కొంతమంది పాత చీరలను గంగిరెద్దుపై కప్పుతూ ఉంటారు.

అసలు గంగిరెద్దుకు ఎలాంటి వస్తువులు దానం చేయాలి.ఎలాంటి వస్తువులు దానం చేయడం వల్ల అరిష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గంగిరెద్దు తో పాటు దాని యజమాని ఇంటికి వస్తే నాటి కాలంలో సాక్షాత్తు శివుడే ఇంటికి వచ్చాడని భావించేవారు.ఇంటికి వచ్చిన గంగిరెద్దు కాళ్ళను నీటితో కడిగే వారు, కంఠం, గొంతు, నుదురు నీటితో కడిగి పసుపు కుంకుమ పెట్టేవారు.

నూతన వస్తువులతో అలంకరించేవారు.గంగిరెద్దును తీసుకువచ్చిన వారి కాళ్ళను కడిగే వారు.గంగిరెద్దుకు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.గంగిరెద్దుకు ఏమైనా వస్తువులు దానం చేసే ముందు వాటి చుట్టూ తిరిగి మొక్కాలి.గంగిరెద్దుకు నూతన వస్త్రాలు దానం చేయాలి.మనం తినే బియ్యం దానం చేయాలి.

సంతోషంగా చిరునవ్వుతో దానం చేయడం మంచిది.పచ్చి గడ్డి, ఎండు గడ్డి గంగిరెద్దుకు తినిపించవచ్చు.

డబ్బులు దానం చేయవచ్చు.

Telugu Blankets, Devotional, Donate, Festival, Sankranti-Latest News - Telugu

గంగిరెద్దుకు ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.గంగిరెద్దులు ఇంటికి వచ్చినప్పుడు వాడిన వస్తువులను గంగిరెద్దుకు దానం చేయకూడదు.ఉపయోగించిన దుప్పట్లు, శాలువాలను గంగిరెద్దుకు దానం చేయడం అస్సలు మంచిది కాదు.

చిరిగిపోయిన వస్త్రాలను కూడా దానం చేయకూడదు.పాడైపోయిన బియ్యం దానం చేయకూడదు.

వాడడానికి వీలు లేని వాటిని అస్సలు దానం చేయకూడదు.సంతోషం లేకుండా అసలు దానం చేయకూడదు.

రజస్వల ఆయన స్త్రీలు దానం చేయడం మహా పాపం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube