పచ్చని మొక్కలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమే.ఆకుపచ్చ వాతావరణం ఎప్పుడు ప్రజలందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది.
చాలామంది వారి ఇంట్లో, అలాగే పెరట్లో కూడా ఆకుపచ్చని మొక్కలను తెచ్చుకుని నాటుకుంటుంటారు.ఇంటి చుట్టూ మొక్కలు నాటడం వల్ల ఇంట్లోకి పరిశుభ్రమైన గాలి కూడా వస్తుంది.
అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా తగ్గిపోతుంది.ఇంటి బయట మొక్కలను ఎక్కువగా నాటుతున్నారు.
కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మీరు మీ జీవితానికి అదృష్టం, సంపాదనను తెచ్చుకునే అవకాశం ఉంది.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గరికే లేకుండా వినాయకుని పూజించడం అస్సలు సాధ్యం కాదు.చాలా కాలంగా సంతానం లేని వ్యక్తులు తమ ఇంట్లో గరిక మొక్కను నాటడం వల్ల సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం గరికను ఇంట్లో నాటుకోవడం ఎంతో మంచిది.ఈ మొక్కకు రోజు నీరు పోసి దానిలోనీ కొన్ని ఆకులను వినాయకుని దగ్గర ఉంచడం వల్ల ఆ ఇంటిపై వినాయకుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

స్నేక్ ప్లాంట్ ఆకులు మందంగా కత్తి ఆకారంలో ఉంటాయి.ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సుఖసంతోషాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం వల్ల డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చని చాలామంది నమ్ముతారు.ఈ మనీ ప్లాంట్ కొమ్మలు నేలను తాకకుండా, తాడు సాయంతో లేదా మట్టిలో పెద్దకర్ర సాయంతో దాన్ని పైకి కట్టడమే మేలు.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు.

తులసి మొక్కను ఇంటికి దక్షిణాన ఉంచడం వల్ల శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు.ఈ మొక్క పెరగడానికి ఎండ ఎక్కువగా ఉండడం మంచిది.రబ్బరు మొక్కను చాలామంది ప్రజలు సంపద మొక్కలుగా భావిస్తారు.
ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, సంపాద ఎక్కువగా వస్తుందని చాలామంది నమ్ముతారు.