ముఖ్యంగా వచ్చే సంవత్సరం మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ నేపథ్యంలో రాశులకు, గ్రహాలకు, గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యత పెరిగిపోయింది.
వ్యక్తిగత జాతకాల సంగతి పక్కన పెడితే గృహ సంచారం ప్రకారం ఏ రాశి వారు ఏ నక్షత్రాల వారు విజయాలు సాధించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.ఈసారి ఏ రాశుల వారికి రాజకీయ యోగం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి శని గురు గ్రహాలతో పాటు శుక్రుడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల మంచి దూకుడుగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.సాధారణంగా ప్రజాప్రతినిధిగా విజయం సాధించడంతోపాటు మంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ రాశిలో జాతకాలు భరణి నక్షత్రానికి సంబంధించిన వారు అయితే రాజకీయ రంగంలో లేదా ఎన్నికలలో విజయం సాధించడం ఖాయమని కచ్చితంగా చెప్పవచ్చు.

తులారాశి వారికి ఈ సంవత్సరం రాజకీయపరంగా విపరీత రాజయోగం రానుంది.ఐదవ స్థానంలో ఉన్న శని ఏడవ స్థానంలోకి మారబోతున్న గురువు వీరిని రాజకీయంగా అభివృద్ధి చేస్తాడని చెప్పవచ్చు.రాజకీయాలలో కీలక పదవులు చేపట్టే అవకాశం కూడా ఉంది.సామాజిక సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఒక విధంగా చూస్తే ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా మకర రాశి వారు ప్రజాసేవ కార్యక్రమాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సంవత్సరం రాజకీయాలలో ఒక మంచి మెట్టుగా వీరికి ఉపయోగపడుతుంది.శని, గురు గ్రహాలు వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి.
కుంభరాశిలో ఉన్న శని కారణంగా జనాకర్షణ పెరుగుతుంది.వీరి మాటకు ఎక్కువగా విలువ ఉంటుంది.
అందువల్ల వీరు ఈ సంవత్సరం ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.