మన దేశం వ్యాప్తంగా శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని( Srisaila shrine ) దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు.అంతే కాకుండా శ్రీశైల పుణ్యక్షేత్రంలో పండుగలు ఆ సమయాలలో వైభవంగా ఎన్నో పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
అలాగే శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు( Maha Shivratri Brahmotsavams ) ఘనంగా ముగిశాయి.చివరి రోజు బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ( Mallikarjuna Swamy )అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనం ఇచ్చారు.
దేవాలయంలో ఉదయం నుంచి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వ వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులను ఇచ్చారు.ఆ తర్వాత శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల మధ్య కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు.ఈ పూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు( Peddiraj couple ), భక్తులు, అధికారులు పాల్గొన్నారు.
ఇంకా చెప్పాలంటే వాహనా పూజలా తర్వాత ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించారు.

ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలను శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి, తొమ్మిది రకాల ఫలాలు నివేదించారు.తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు.అలాగే ఈ శయనోత్సవానికి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ స్వామి అమ్మవార్ల శయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంత సేవ నిర్వహించారు.
ఈ పూజ కైకర్యాలలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.ఈ సంవత్సరం ఎంతో ఘనంగా, వైభవంగా శ్రీ స్వామి, అమ్మ వారికి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యాయి.