మన దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.
ఈ దేవాలయాలు కొన్ని ముఖ్యమైన గ్రహణాలకు కొన్ని గంటలు మూసివేస్తుంటారు.కానీ సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే దేవాలయం గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు.
ఐదు గంటల తర్వాత గుడి తలుపులను అక్కడి అర్చకులు మూసివేస్తారు.మళ్ళీ అమ్మవారి దర్శనం కావాలంటే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే అదే నీరాయ్ మాత దేవాలయం.
ఈ దేవాలయం చత్తీస్గడ్ లోని గారి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంది. నిరాయ్ మాత దేవాలయంలోని కేవలం చైత్ర నవరాత్రి అంటే ఉగాది ఉత్సవాల సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం వీలు ఉంటుంది.
ఆ రోజు దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.ఇంకా చెప్పాలంటే ఈ ఆలయానికి మహిళలకు ప్రవేశం లేదు.సాధారణంగా అన్ని దేవాలయాల్లో అర్చకులు ఉపయోగించే కుంకుమ, తేనే, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఎప్పుడూ ఏ కార్యక్రమానికి ఉపయోగించరు.కేవలం కొబ్బరికాయ కొట్టి అగరవత్తులు వెలిగిస్తే చాలు అమ్మకి పూజ చేసినట్లే అని అక్కడి అర్చకులు చెబుతున్నారు.
ఆ 5 గంటల తర్వాత భక్తులను దేవాలయంలోకి అసలు అనుమతించరు.అంతేకాకుండా ఈ దేవాలయంలోకి మహిళల ప్రవేశం కూడా నిషేధించబడింది.ఆ నిషిద్ధం ప్రవేశం వరకు మాత్రమే కాదు చివరికి అమ్మవారి ప్రసాదం కూడా మహిళలు తినకూడదు.కాదు కూడదు అని తింటే జీవితంలో ఏదో చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
అయితే సంవత్సరంలో ఐదు గంటలు మాత్రమే ఎందుకు తెరుస్తారు? మహిళలను ఎందుకు అనుమతించరు అన్నది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు.తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు పాటిస్తున్నారు.
అందుకని మేము కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు తప్ప ఈ మాత గురించి మరో విషయం అక్కడివారు ఎవరు చెప్పలేకపోతున్నారు.
DEVOTIONAL