ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ జీవితంలో డబ్బు, జ్ఞానం బాగా సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు.అలాంటివారు పూజలో ప్రధమ దైవంగా పూజించే ఆ విగ్నేశ్వరుణ్ణి( Vigneshwarudu ) సంకాష్టహర చతుర్దశి రోజు పూజిస్తే సర్వ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఆ విగ్నేశ్వరుణ్ణి కృప వల్ల ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెబుతున్నారు.సర్వ కష్టాలను దూరం చేసి ఆ సంకష్టహర చతుర్దశి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంకష్ట చతుర్దశి( Sankashta Chaturdashi ) పూజ ప్రతినెల కృష్ణపక్షంలో పౌర్ణమి వెళ్లిన నాలుగవ రోజైన చతుర్దశి రోజు చేయాలి.విఘ్నేశ్వరునికి 32 స్వరా రూపాలలో చివరిదైనా సంకష్ట రూపం విఘ్నేశ్వరికి ఎంతో ఇష్టం.
అందువల్ల ఆ రోజున విగ్నేశ్వరుని పూజిస్తే ఎంతటి సమస్యకైన పరిష్కారం లభిస్తుంది.

బహుళపక్షంలో చతుర్దశి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి బకెట్ నీటిలో కొన్ని నువ్వుల గింజలు వేసి ఆ నీటితో తలస్నానం చేయాలి.స్వామి వారికి ఎర్రటి గుడ్డ ముక్క తీసుకొని పసుపు, కుంకుమ వేసి మూడు దోసెలతో బియ్యం వేసి రెండు తాంబూలాలు, దక్షిణ, ఖర్జూరాలు( Dates ) వేసి ముడుపు కట్టాలి.ఆ తర్వాత స్వామి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి.
ముడుపును సమర్పించే ముందు కోరికను బలంగా కోరుకుని సమర్పించడం మంచిది.ఈ పూజ చేసేవారు కటిక ఉపవాసం ఉండడం మంచిది.
ఇందులో మరో నియమం ఏమిటంటే ఆ రోజు కచ్చితంగా మంచి మాటలే మాట్లాడాలి.అదే రోజు సాయంత్రం వేళ మళ్లీ తల స్నానం చేసి ఇప్పుడు వ్రతన్ని మొదలుపెట్టాలి.
మొదట ఉదయం కట్టిన బియ్యంతో సాయంత్రం వేళ పాయసం, 21 కుడుములు చేసి ప్రసాదంగా సమర్పించాలి.ఈ పూజలో మొదటిగా పసుపుతో వినాయకుడిని గౌరీని చేసుకొని మొదలుపెట్టాలి.
తర్వాత షోడపోచారపూజ( Shodapochara Puja ) చేసి 21 పూలు మరియు 21 పత్రిని సమర్పించాలి.ఈ సంకటహరచతుర్దశి వ్రతంలో సంకటహర స్తోత్రమును చదవాలి.
తర్వాత ఇంటికి ఎవరైనా పిలిచి మర్యాదపూర్వకంగా భోజనం పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి.ఈరోజు కచ్చితంగా బ్రహ్మచర్యము పాటించాలని పండితులు చెబుతున్నారు.