సాధారణంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.ఈ క్రమంలోనే ఆ క్రీమ్స్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యం అయ్యే క్రీమ్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ద్వారా న్యాచురల్ గా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఎగ్ ను బ్రేక్ చేసి లోపల ఉండే పచ్చ సొన ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగు వేసుకుని స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి.చివరిగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెసర పిండి కూడా వేసి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్నిఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ ను చర్మానికి రాసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం సహజంగానే తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.అలాగే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
మరియు ఈ రెమెడీని పాటించడం వల్ల స్మూత్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
తెల్లగా మారండి.