శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఇవే?

తెలుగు మాసాలలో ఐదవ మాసమైన శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది.శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు వ్రతాలు వస్తాయి.

 August 2021 Vrat Festival Calendar Here Are The Festivals And Vrats In The Month-TeluguStop.com

ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో మహిళలు పండుగలు, నోములు చేస్తూ ఎంతో హడావిడిగా కనిపిస్తుంటారు.మరి శ్రావణ మాసంలో ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శ్రావణ సోమవారాలు

అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి.ఈ నెలలో వచ్చే సోమవారాలలో భక్తిశ్రద్ధలతో పూజించడం చేత స్వామివారు ప్రీతి చెందుతారు.పరమేశ్వరుడికి శివరాత్రి తర్వాత ఈ మాసంలో అత్యధిక పూజలు నిర్వహిస్తారు.

నాగ పంచమి

శ్రావణ మాసంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భక్తులు ఈ నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 13న జరుపుకుంటున్నారు.

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం అంటేనే లక్ష్మీదేవికి ఎన్నో పూజలు వ్రతాలు జరుగుతాయి.ఈ క్రమంలోనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు.మరి ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీ వరలక్ష్మీ వ్రతం వచ్చింది.

ఓనం పండుగ

ఇది తెలుగు రాష్ట్రాలలో కన్నా కేరళలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.ఈ పండుగ ఆగస్టు 21వ తేదీ వచ్చింది.

రక్షాబంధన్ అన్నా చెల్లెలి ప్రేమకు గుర్తుగా జరుపుకునే పండుగే రక్షాబంధన్.ఈ రక్షాబంధన్ ఈ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ వచ్చింది.ఈ పండుగ రోజు అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి తమ పై ప్రేమను వ్యక్త పరుస్తారు.

కృష్ణాష్టమి కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఆగస్టు 30న జరుపుకోనున్నారు.కృష్ణాష్టమి వేడుకలను కులమతాలకతీతంగా జరుపుకోవడం విశేషం అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube