అష్టాదశ పురాణాలు అంటే ఏమిటి? అవి ఏవి?

అష్టాదశ పురాణాలను వ్యాస మహర్షి రచించాడు.అష్టాదశ అనగా 18 పురాణ గాథలు.

 Ashtadasha Puranala Names, Vishnu Puranam, Ashtadasha Puranalu , Devotional , Sh-TeluguStop.com

శ్లోకాల రూపంలో వీటిని వివరించాడు వ్యాస మహర్షి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మ పురాణం.దీనిని బ్రహ్మదేవుడు మరీచికి బోధించాడు.

రెండోది పద్మ పురాణం.ఇది కూడా బ్రహ్మదేవుడే వివరించినట్లు పురాణాల్లో ఉంది.

మూడోది విష్ణు పురాణం.ఇది పరాశరుని రచన.నాలుగోది శివ పురాణం.ఇది వాయు దేవునిచే చెప్పబడింది.ఐదోది లింగ పురాణం.దీనిని నందీశ్వరుడు రచించాడట.ఆరోది గరుడ పురాణం.విష్ణుమూర్తి గరుత్మంతునికి ఈ పురాణం చెప్పినట్లు వివరించబడింది.

ఏడోది నారద పురాణం.ఇది నారద మహర్షి రచన.

ఎనిమిదోది భాగవత పురాణం.శుక మహర్షిచే ఈ పురాణం చెప్పబడింది.

తొమ్మిదోది అగ్ని పురాణం.దీన్ని భృగు మహర్షి చెప్పాడు.

పదోది స్కంద పురాణం.ఈ పురాణాన్ని కుమార స్వామి చెప్పాడు.

పదకొండవది భవిష్య పురాణం.దీనికే భవిష్యోత్తర పురాణం అనే పేరు కూడా ఉంది.

శతానీకుడు సుమంతునకు దీన్ని గురించి వివరించాడు.

పన్నెండవది బ్రహ్మవైవర్త పురాణం.వశిష్ట మహర్షి అంబరీషునికి ఉపదేశించింది.పదమూడవది మార్కండేయ పురాణం.

దీన్ని పక్షులు జైమినికి చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది.పద్నాలుగవది వామన పురాణం.

అది బ్రహ్మ దేవుడి రచన.పదిహేనవది వరాహ పురాణం. శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించింది. పదహారవది మత్స్య పురాణం. శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించాడట. పదిహేడవది కూర్మ పురాణం.

దీన్ని శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. పద్దెనిమిదవది బ్రహ్మాండ పురాణం.

ఇది బ్రహ్మ దేవుడి రచన.

Ashtadasha Puranala Names, Vishnu Puranam, Ashtadasha Puranalu , Devotional , Shiva Puranam, Matsya Puranam - Telugu Devotional, Vyasa Maharshi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube