నిద్రలో దాదాపు అందరికీ సాధారణంగానే కలలు వస్తూ ఉంటాయి.కానీ ప్రతి కలకి అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
కలలు అనేవి భవిష్యత్తులో మనకు జరగబోయే సంఘటనలను సూచిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అయితే చాలా వరకు కొన్ని రకాల కలలు మనకు గుర్తు ఉండవు.
కానీ మరి కొన్ని మాత్రం గుర్తుకు వస్తూ ఉంటాయి.కొన్ని ప్రశాంతమైన కలలు వస్తే, మరి కొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి.
అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ కలల గురించి చాలా మంది కంగారుపడుతూ ఉంటారు.కలల్ని అర్థం చేసుకోవడం కష్టం.
కలలో వచ్చే పలు విషయాలు భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్ర( Swapna Shastra ) నిపుణులు చెబుతున్నారు.
ఇలాగే చాలా మందికి కలలో తను చనిపోయినట్లు కలలు కూడా వస్తూ ఉంటాయి.మరి ఇలాంటి కలలు రావడం వెనుక ఉన్న అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీరు చనిపోయినట్లు కానీ, వేరే ఎవరైనా చనిపోయినట్లు కాని కల వస్తే అది శుభ సంకేతమే అని నిపుణులు చెబుతున్నారు.
ఈ కల వస్తే త్వరలోనే మీ పాత కోరికలు ఏవైనా ఉంటే నెరవేరుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.ఈ కల వస్తే మీరు రాబోయే రోజుల్లో అపరమైన విజయాన్ని సాధిస్తారని చెబుతున్నారు.
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు కల వస్తే మంచిదే కానీ అది ఏ సమయంలో వచ్చింది అనే దాని పై ఆధారపడి ఉంటుంది.
అలాగే బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurtham )లో మీకు ఇష్టమైన వ్యక్తి చనిపోయినట్లు కల వస్తే మాత్రం అది ఖచ్చితంగా అశుభమే అని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఈ కల అర్ధరాత్రి వస్తే మాత్రం ఆ వ్యక్తి దీర్ఘాయుతో ఉంటాడని చెబుతున్నారు.అదే విధంగా స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన బంధువులు కానీ, వ్యక్తులు కానీ కలలో వస్తే అది కూడా అశుభంగా భావిస్తారు.
చనిపోయిన వ్యక్తులు కలలో వస్తే వారు మనకు ఏదో సూచిస్తున్నారని అర్థం చేసుకోవాలి.కష్టాల్లో ఉన్నప్పుడు చనిపోయిన బంధువులు కలలోకి వస్తారు.వారు కలలో కనిపించి మీకు రాబోయే సమస్యల గురించి హెచ్చరిస్తారు.రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో సమస్యలు వస్తాయని హెచ్చరించడానికి వారు కలలో కనిపిస్తారని స్వప్న శాస్త్రం చెబుతోంది
.