Brahmanandam: అవార్డు వస్తే ఆ రోజు బ్రహ్మానందం ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం( Brahmanandam ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.చాలా ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ నటుడు ఇప్పుడు కాస్త సీరియస్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

 Brahmanadam About His Awards-TeluguStop.com

ఇటీవలే రంగమార్తాండ సినిమాలో( Rangamarthanda ) ఒక సీరియస్ క్యారెక్టర్ చేసి చాలా బాగా అలరించాడు.పంచతంత్రం( Panchatantram ) సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు.

సినిమాలతో పాటు రీసెంట్ టైమ్‌లో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు.ఇందులో భాగంగా ఈ టాలెంటెడ్ కమెడియన్ మరొక హాస్య నటుడైన ఆలీతో( Comedian Ali ) ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విశేషాలు పంచుకున్నాడు.

తనకు అవార్డు( Award ) లభించిన రోజు ఇంటికి వెళ్లి నేలపై మామూలు దుప్పటి వేసుకొని, లుంగీ కట్టుకొని దానిపై పడుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అలా చేయడానికి కారణమేంటో కూడా వివరించాడు.

Telugu Brahmanandam, Ali, Panchatantram, Rangamarthanda-Movie

బ్రహ్మానందం మాట్లాడుతూ బాగా నటించినప్పుడు ఎన్నో పొగడ్తలు వస్తాయని, వాటి వల్ల అహంకారం పెరుగుతుందని అన్నాడు.ఆ అహంకారంతో బతకకుండా, మన పని మనం చక్కగా చేసుకోవాలని చెప్పుకొచ్చాడు.అలాంటి మనస్తత్వంతో బతకాలంటే ఎప్పుడూ కూడా మనమే గొప్ప అనే భావన లేకుండా జీవించాలని వివరించాడు.అందుకే తాను గొప్ప వాడిని కాదని, మామూలు దుప్పటిపై పడుకునే సామాన్యుడినని గుర్తు చేసుకుంటూ అతను నేలపై పడుకుంటానని వెల్లడించాడు.

ఇదే ఇంటర్వ్యూలో డబ్బు విలువ గురించి కూడా బ్రహ్మానందం మాట్లాడాడు.డబ్బుకు అందరూ విలువ ఇస్తారు కానీ దాని విలువ ఏంటో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపరని తెలిపాడు.

Telugu Brahmanandam, Ali, Panchatantram, Rangamarthanda-Movie

నెల నెలా కొంత డబ్బులు( Money ) వెనకేసుకుంటే కష్టకాలంలో ఎవరినీ చేయి చాపి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదని వెల్లడించాడు.బ్రహ్మానందం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చాలామంది బ్రహ్మానందం చెప్పిన మాటలతో అంగీకరిస్తున్నారు.బ్రహ్మీ గొప్ప కమెడియన్ మాత్రమే కాదు, గొప్ప ఫిలాసఫర్ కూడా అంటూ కితాభిస్తున్నారు.బ్రహ్మానందం బాగా చదువుకున్న వ్యక్తి అనే సంగతి తెలిసిందే.ఇక ఇతను మంచి పెయింటర్ కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube