శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి ఏడాది పెద్ద పండుగ ప్రజలందరూ జరుపుకుంటారు.హిందూ ధర్మం( Hindu Dharma 0 ప్రకారం ఈ పవిత్ర పండుగను కొన్ని నియమాల ప్రకారం శ్రీకృష్ణుడి( Lord Krishna )ని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడు భక్తులపై అపారమైన ఆశీర్వాదాలను కురిపిస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.సనాతన ధర్మంలో శ్రీ విష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని ప్రజలు నమ్ముతారు.
వీటిని అనుసరిస్తూ పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతాడు.

జన్మాష్టమి( Janmashtami ) రోజున రాత్రి కన్నయ్యను పూజించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ ధర్మం ప్రకారం శ్రీకృష్ణుడు పసుపు రంగును ఎంతో ఇష్టపడతాడు.ముఖ్యంగా చెప్పాలంటే జన్మాష్టమి రోజున పసుపు రంగు దుస్తులను ధరించి శ్రీకృష్ణుని పూజిస్తే కోరిన వరాలను ప్రసాదిస్తాడని ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే శ్రీ విష్ణువు ( Sri Vishnu )అవతారమైన శ్రీకృష్ణుని ఆరాధనలో శంఖానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శంఖం ఉపయోగించడం విశేషంగా పరిగణిస్తారు.ఒక వ్యక్తి జన్మాష్టమి రోజు రాత్రి దక్షిణావర్తి శంఖాన్ని నీరు,పాలతో నింపి శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తే ఆ వ్యక్తిపై శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు.

అంతే కాకుండా అతని ఇల్లు సంవత్సరం పొడవునా సుఖ సంపదలు,ధన ధాన్యాలతో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఎంత కష్టపడి పని చేసిన కొంత మంది ప్రజలు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి( Shri Krishna Janmashtami ) రోజు రాత్రి శ్రీకృష్ణ భగవానుడికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేస్తే ఆ వ్యక్తి ఇంట్లో ఆనందం, అదృష్టం, సంపద పెరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి జన్మాష్టమి రోజున రాధాకృష్ణుల( Radhakrishna ) దేవాలయానికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయాలి.కన్నయ్యకు పసుపు రంగు పూలను సమర్పించడం ద్వారా అతని బాధలు తొలగిపోతాయి.
అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.