ఎంత మంది సూపర్‌ స్టార్‌ లు ఉన్నా నేను చిరంజీవి అభిమానినే

తన ముందు ఎంత మంది సూపర్‌ స్టార్‌ లను తీసుకు వచ్చి నిలబెట్టినా కూడా నేను నా అభిమాన హీరో చిరంజీవి అనే చెప్తాను తప్ప మరే పేరు కూడా చెప్పను అంటూ ప్రముక దర్శకుడు గుణ శేఖర్‌ చెప్పుకొచ్చాడు.ఎంత మంది సూపర్ స్టార్ లు కొత్త వారు వచ్చినా కూడా మెగా స్టార్‌ చిరంజీవి ఆ రేంజ్‌ వేరే అంటూ ఫ్యాన్స్ అంటూ ఉంటారు.

 Chiranjeevi Is My All Time Favorite Star Hero Says Gunasekhar, Director Gunasekh-TeluguStop.com

ఇప్పుడు అదే మాటను దర్శకుడు గుణ శేఖర్ అనడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం సినిమా లు చేస్తున్న చిరంజీవి ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని.

ఆయన తనయుడు చరణ్‌ మాదిరిగా చాలా సన్నగా ఉన్న ఆయన ఈ వయసు లో కూడా ఆయన కనిపిస్తున్న తీరు నాకు ఆశ్చర్యంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఆచార్య సినిమా లో లుక్‌ పై మరింతగా ఆశ్చర్యంను ఆయన వ్యక్తం చేశాడు.
రామ్‌ చరణ్‌ తో ఆ మద్య చరణ్‌ ను చూసిన సమయంలో ఇంత సన్నగా అయ్యాడా లేదంటే గ్రాఫిక్స్ అయ్యి ఉంటుందా అనుకున్నాను.కాని ఆయన నిజంగా చాలా సన్నగా అయ్యారని సమంత టాక్ షో ద్వారా తెలిసింది.

ఆయన ఒక పాత్ర కోసం ఈ సమయంలో అంతగా కష్టపడటం అంటే మామూలు విషయం కాదు.ఆయన మాత్రమే అలా పాత్ర కోసం కష్టపడతారు అంటూ అభినందించారు.

గుణశేఖర్ వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్‌ చేస్తున్నారు.వీడియో కాస్త పాతదే అయినా కూడా నెట్టింట ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు ప్రస్తుతం చర్చిస్తున్నారు.

ఆయన లుక్‌ మరియు ఆయన డెడికేషన్‌ కారణంగానే ఆల్ టైమ్‌ ఫేవరేట్‌ స్టార్‌ తనకు అంటూ చె్పుకొచ్చాడు.తన చూడాలని ఉంది సినిమా లో ఎలా అయితే కనిపించాడో అలాగే ఈ సినిమాలో కూడా కనిపిస్తున్నాడు అంటూ గుణశేఖర్‌ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube