ఒక్క సినిమా ముగ్గురి భవిష్యత్తు.. ఆ సినిమాతో ఈ ముగ్గురి జాతకాలు మారతాయా?

Kushi Movie Result Will Decide These Celebrities Career Details Here Goes Viral , Kushi Movie , Vijay Devarakonda, Samantha, Shiva Nirvana, Puri Jagannath, Tollywood

సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ ఫ్లాప్ కాంబినేషన్లకు ఉండదు.అదే సమయంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్ గత సినిమాలు ఫ్లాప్ అయితే ఆ సినిమాల బిజినెస్ పై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

 Kushi Movie Result Will Decide These Celebrities Career Details Here Goes Viral-TeluguStop.com

విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ( Vijay Devarakonda, Samantha, Shiva Nirvana ) కాంబినేషన్ లో ఖుషి( Khushi ) మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే విజయ్ దేవరకొండ గత సినిమా లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచి పూరీ జగన్నాథ్ ( Puri Jagannath )ను అప్పుల్లో ముంచేసింది.ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి పూరీ జగన్నాథ్ బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన సినిమాలన్నీ నిరాశ పరుస్తున్నాయి.ఖుషి సినిమా విజయ్ ఫ్లాపులకు బ్రేక్ వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు చిన్న సినిమాలు భారీ షాకిస్తున్నాయి.

మైత్రీ నిర్మాతలకు( mythri producers ) పెద్ద హీరోల సినిమాలు భారీ లాభాలను అందిస్తుండగా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు మాత్రం షాకింగ్ ఫలితాలను మిగుల్చుతున్నాయి.సమంత గత సినిమాలలో యశోద మూవీ యావరేజ్ గా నిలవగా శాకుంతలం నష్టాలను మిగిల్చింది.వెబ్ సిరీస్ లు సక్సెస్ సాధిస్తున్నా ఆ సక్సెస్ లతో సమంత మార్కెట్ ను అంచనా వేయడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా నిర్మాత శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమాతో షాకింగ్ ఫలితాన్ని ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా గురించి క్రిటిక్స్ నుంచి దారుణంగా రివ్యూలు వచ్చాయి.సమంత, విజయ్ దేవరకొండ, శివ నిర్వాణలకు ఖుషి సినిమా భారీ సక్సెస్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది.

Video : Kushi Movie Result Will Decide These Celebrities Career Details Here Goes Viral #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube