కార్తికేయ 2 హిట్ తో భారీ గా డిమాండ్ చేస్తున్న నిఖిల్...

ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా మారారు.

 Nikhil Demands Huge Remuneration After Karthikeya 2 Success Details, Nikhil , Ka-TeluguStop.com

సినిమా సినిమాకు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నారు నిఖిల్. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక సినిమా తర్వాత మరొక సినిమాతో చాలా సెలెక్టివ్ గా ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ వైపుగా అడుగులు వేస్తున్న నిఖిల్ తన సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి…

కార్తికేయ 2( Karthikeya 2 ) సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు స్వయంభు( Swayambhu Movie ) అనే టైటిల్ తో ఒక కొత్త సినిమాను ప్రకటించారు.

 Nikhil Demands Huge Remuneration After Karthikeya 2 Success Details, Nikhil , Ka-TeluguStop.com

ప్రస్తుతం వరుస విజయాలు వస్తున్న నేపథ్యంలో ఆయన పారితోషకం ( Nikhil Remuneration ) కూడా బాగా పెంచేశారు అని తెలుస్తోంది.మొన్నటి వరకు మూడు నాలుగు కోట్లకే పరిమితమైన ఈయన ఇప్పుడు ఏకంగా స్వయంభూ సినిమా కోసం రూ.8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం…

Telugu Nikhil, Karthikeya, Swayambhu-Movie

ఇకపోతే హ్యాపీడేస్ వంటి సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్ల ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎదుగుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఇక స్వయంభూ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.టాప్ బ్యానర్లలో సినిమాలకు నిఖిల్ బెస్ట్ ఆప్షన్ గా నిలవడం జరిగింది.నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత వచ్చే లాభాలలో వాటా కూడా ఆయన తీసుకోబోతున్నట్లు సమాచారం.

Telugu Nikhil, Karthikeya, Swayambhu-Movie

వార్ బ్యాక్ డ్రాప్ లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నిఖిల్ మరో పాన్ ఇండియా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.మొత్తానికైతే నిఖిల్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతూ సక్సెస్ రేట్ సొంతం చేసుకుంటూ రెమ్యునరేషన్ ని కూడా పెంచేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube