ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం అయింది.ఈ మేరకు ఈనెల 14వ తేదీ నుంచి వారాహిలో పవన్ ప్రచారం నిర్వహించనున్నారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహార్ తెలిపారు.
తొలి విడత యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు కొనసాగనుందని నాదెండ్ల వెల్లడించారు.ఈ క్రమంలో అన్నవరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు పవన్ బయలుదేరతారని చెప్పారు.
కాగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.వారాహి యాత్రలో భాగంగా పవన్ మహిళలు, రైతులు మరియు యువత సమస్యలను స్వయంగా తెలుసుకుంటారని వెల్లడించారు పవన్ కళ్యాణ్ రెండు గోదావరి జిల్లాలలో ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలలో యాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించడం జరిగింది.







