పొట్ట కొవ్వును మాయం చేసే మామిడి పండ్లు.. ఎలా తీసుకోవాలంటే?

సాధారణంగా కొందరికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట వద్ద మాత్రమే కొవ్వు పేరుకుపోయి లావుగా మారుతుంటుంది.ఇందుకు కారణాలు అనేకం.

 How To Take Mangoes To Melt Belly Fat?, Mangoes, Belly Fat, Belly Fat Melting Sm-TeluguStop.com

గంటలు తరబడి కూర్చుని ఉండటం, ‌ఆహారపు అలవాట్లు, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్( Belly Fat ) సమస్య ఏర్పడుతుంది.దాంతో బాన పొట్టను కరిగించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

కానీ కొన్ని కొన్ని ఆహారాలు పొట్ట కొవ్వును మాయం చేయడానికి ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.అటువంటి ఆహారాల్లో మామిడి పండ్లు కూడా ఒకటి.

Telugu Belly Fat, Tips, Latest, Mangobanana, Mangoes-Telugu Health

ప్రస్తుత వేసవికాలంలో మామిడి పండ్లు( Mangoes ) విరివిరిగా లభ్యమవుతుంటాయి.పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు.

అయితే రుచిగా ఉండడమే కాదు మామిడి పండ్లలో ఎన్నో పోషక విలువలు కూడా నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.పొట్ట కోవ్వును మాయం చేయడానికి కూడా మామిడి పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అందుకోసం మామిడి పండ్లను ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Belly Fat, Tips, Latest, Mangobanana, Mangoes-Telugu Health

ముందుగా ఒక మామిడి పండును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్‌ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే సగం అరటిపండు తీసుకుని స్లైసెస్ మాదిరి కట్ చేయాలి.ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు, అరటి పండు( Banana ) స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ వాటర్ లో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసి సేవించాలి.

మ్యాంగో బనానా స్మూతీ( Mango Banana Smoothie ) డైట్ లో చేర్చుకుంటే పొట్ట కొవ్వు దెబ్బకు కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

పైగా ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఈ స్మూతీని తీసుకోవడం వల్ల నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు దృఢంగా మారతాయి.రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube