ఉదయం నిద్ర లేవగానే చాలా మంది ప్రజలు కాఫీ తాగుతూ( Drinking coffee ) ఉంటారు.కాఫీ తాగకపోతే వీరు ఏదో కోల్పోయిన భవనతో ఉంటారు.
కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడంలో ఎంత నిజం ఉందో, పరిగడుపున కాఫీ తాగితే అంతే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.ఇంతకీ కాఫీ ఖాళీ కడుపుతో తాగితే జరిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగితే కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ను( Acid reflux ) పెంచుతుంది.అలాగే కార్టిసాల్ స్థాయిలను పెరగడానికి కారణం అవుతుంది.

ఇది ఒత్తిడిని కూడా పెంచుతుంది.అలాగే కాఫీ శరీరంలో శక్తి స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది.అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఆందోళన, భయం, ఒత్తిడి ( Anxiety, fear, stress ) పెరగవచ్చు.అలాగే ఉద్రగం కూడా పెరుగుతుంది.అలాగే రోజు వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది.అలాగే విశ్రాంతిని తీయడం దెబ్బతీయటమే కాకుండా ఏకాగ్రత ను దెబ్బ తిస్తుంది.
అలాగే కాఫీలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.అయితే ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే కడుపులో అమ్లము పెరుగుతుంది.
కెఫిన్, యాసిడ్( Caffeine, acid ) స్థాయిల కలయిక కడుపు లో ఇబ్బందినీ కలిగిస్తుంది.

దీంతో కడుపు నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది.అలాగే కాలక్రమమైన ఇది అల్సర్స్( Ulcers ) వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.కాఫీలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలో ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి.దీంతో శరీరం త్వరగా అనారోగ్యానికి గురవుతుంది.
ఇంకా చెప్పాలంటే కెఫీన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కెఫిన్ కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.